మెట్రో స్టేషన్‌లో యువకుడి వికృత చేష్టలు.. లిఫ్ట్‌ ఎక్కి.. బట్టలు విప్పి

18 May, 2022 11:21 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ లిఫ్ట్‌లో ఒంటరిగా వెళ్లే మహిళల ఎదుట వికృత చేష్టలకు పాల్పడుతున్న యువకుడిని ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఖైరతాబాద్‌కు చెందిన ఓ మహిళ మంగళవారం షాపింగ్‌ చేసేందుకు అమీర్‌పేటకు వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు అమీర్‌పేట చెన్నై షాపింగ్‌ మాల్‌ ఎదురుగా ఉన్న మెట్రో స్టేషన్‌ లిఫ్ట్‌ ఎక్కింది. వెనకాలే వచ్చిన ఓ యువకుడు లిఫ్ట్‌లోకి ఎక్కాడు.

బట్టలు విప్పి వికృత చేష్టలు చేయడాన్ని గమనించిన ఆమె భయంతో పరుగెత్తుకుంటూ వెళ్లి మెట్రో సెక్యూరిటి సిబ్బందికి తెలిపింది. సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణలో అతను ఒడిషాకు చెందిన రాజుగా గుర్తించారు. సోమవారం నగరానికి వచ్చిన అతను ఉదయం నుంచి లిఫ్ట్‌లో ఇలాగే ప్రవర్తిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చదవండి: ప్రయాణికులకు ఊరట.. లష్కర్‌లో మినీ బస్సులు టికెట్‌ రూ.5

  

మరిన్ని వార్తలు