సాయితేజ బిడ్డల చదువు బాధ్యత తీసుకుంటా: మంచు విష్ణు

10 Dec, 2021 02:57 IST|Sakshi

కురబలకోట: అమర జవాన్‌ బి.సాయితేజ బిడ్డలు మోక్షజ్ఞ, దర్శిని చదువుల బాధ్యత పూర్తిగా తీసుకుంటామని మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు ప్రకటించారు. గురువారం ఆయన పీఏ సతీశ్‌ కురబలకోట మండలంలోని రేగడపల్లెకు వచ్చారు.

సాయితేజ భార్య శ్యామలను మంచు విష్ణుతో ఫోన్‌లో మాట్లాడించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు  మాట్లాడుతూ సాయితేజ బిడ్డల చదువుల బాధ్యత పూర్తిగా తీసుకుంటామని, శ్రీవిద్యా నికేతన్‌లో ఎందాకైనా చదివిస్తామని చెప్పారు. 

మరిన్ని వార్తలు