బయటపడ్డ పదో శతాబ్దం నాటి శిల్పాలు..ఎలా ఉన్నాయో తెలుసా?

23 Jul, 2021 08:19 IST|Sakshi
నార్సింగి శివారులో గుర్తించిన 10వ శతాబ్దపు వీరగల్లు వీరుడి రాతి శిల్పం

 శైవ వీరగల్లు వీరుల రాతి శిల్పాలుగా గుర్తింపు

సాక్షి, నార్సింగి(తూప్రాన్‌):  మెదక్‌జిల్లా నార్సింగి మండల కేంద్రశివారులో శైవవీరగల్లు వీరుల రాతి శిల్పాలు గుర్తించామని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ హరగోపాల్‌ అన్నారు. నార్సింగి శివారులో రెండోరోజు పర్యటనలో భాగంగా గురువారం గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద రాష్ట్ర కూటుల కాలం నాటివిగా భావించే రాతిపై చెక్కిన శిల్పాలను గుర్తించామన్నారు.

మూడు రకాల వీరగల్లుల శిల్పాలు ఉండగా, వాటిలో కత్తిని చేబట్టి చేతిలో ఫలం పట్టుకున్న  ఆత్మాహుతి వీరగల్లు శిల్పం ముఖ్యమైందన్నారు. 10వ శతాబ్దానికి చెందిన ఈ శిల్పాలు పెద్ద పెద్ద మీసాలతో భయంగొలిపే ముఖంతో ఉన్నాయని తెలిపారు. శిల్పాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి పుస్తక రూపంలో ప్రచురిస్తామని చెప్పారు. క్షేత్ర పరిశోధనలో ఫొటోగ్రాఫర్‌ కొలిపాక శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు