చల్‌చల్‌ గుర్రం.. 50 ఏళ్లుగా అశ్వాన్నే వాడుతున్న రైతు

11 Dec, 2022 12:45 IST|Sakshi

సాక్షి, బషీరాబాద్‌: ప్రస్తుత యాంత్రిక జీవితంలో ప్రతిఒక్కరూ శరవేగంగా గమ్యం చేరాలని భావిస్తున్నారు. నిమిషాలు, గంటల్లో వెళ్లేలా ఆధునిక వాహనాలను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఖరీదైనన కార్లు, బైకులు కనిస్తున్నాయి.

కానీ బషీరాబాద్‌ మండలం ఎక్మాయికి చెందిన   రైతు అల్లూరు నర్సయ్యగౌడ్‌ యాభై ఏళ్లుగా అశ్వాన్నే వాహనంగా వాడుతున్నారు. తన 18వ ఏట నుంచి ఇప్పటి వరకు సుమారు ఐదు గుర్రాలపై స్వారీ చేసినట్లు చెబుతున్నాడు. ఎక్కడికి వెళ్లినా ప్రమాదం లేకుండా, పైసా ఖర్చు లేకుండా ప్రయాణం పూర్తవుతుందని తెలిపాడు. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే తప్ప బైకులు, కార్లు, బస్సులు ఎక్కలేదని వివరించాడు.   

(చదవండి: నాడు నాన్న.. నేడు అమ్మ  అనాథైన బాలిక )

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు