Photo Feature: వెనుక ‘బడి’..

19 Jun, 2022 11:29 IST|Sakshi

జగదేవ్‌పూర్‌ (గజ్వేల్‌): ఆ గ్రామ ప్రభుత్వ బడిలో విద్యార్థులున్నారు.. కానీ చదు వు చెప్పేందుకు ఉపాధ్యాయుడు లేరు. ఇదీ సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండ లం నిర్మల్‌నగర్‌ పాఠశాల పరిస్థితి. ఆ పాఠశాలలో 30 మందికి పైగా పిల్లలున్నా రెగ్యులర్‌ ఉపాధ్యాయుడు లేరు. దీంతో డిప్యుటేషన్‌పై ఒక ఉపాధ్యాయుడిని ని యమించారు. ఈ నేపథ్యంలో సర్పంచ్‌ శ్యామలరాజు, గ్రామస్తుల సహకారంతో రెండేళ్లుగా ఇద్దరు విద్యావలంటీర్లను ఏర్పాటు చేసి పాఠాలు చెప్పించారు.

పాఠశా లలు పునఃప్రారంభమయ్యాక డిప్యుటేషన్‌ ఉపాధ్యాయుడు మొదటి రోజు వచ్చి వెళ్లారు. ఆ తర్వాత నుంచి రాకపోవడంతో కొందరు పిల్లలు పక్క గ్రామంలోని ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో చేరారు. మరికొందరు రోజూ బడికి వచ్చి వెళ్తున్నారు. దీనిపై ఎంఈవోను వివరణ కోరగా రెగ్యులర్‌ ఉపాధ్యాయుడు లేక ఇబ్బందిగా ఉందని, విద్యావలంటీర్‌ను ఏర్పాటు చేసి పాఠశాలను నడిపిస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు