తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌ల నిలిపివేత

14 May, 2021 09:15 IST|Sakshi

అంబులెన్స్‌ల నిలిపివేతతో కోవిడ్‌ పేషెంట్ల ఇబ్బందులు

సాక్షి, సూర్యాపేట: తెలంగాణ సరిహద్దులో ఏపీ అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. అంబులెన్స్‌లను వెనక్కి పంపడంతో కోవిడ్‌ పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి లెటర్, కోవిడ్ కంట్రోల్ రూమ్ నుంచి జారీ చేసిన పాస్‌లు ఉంటేనే అనుమతి ఇస్తున్నారు.

పంచలింగాల టోల్‌గేట్‌ వద్ద..
కర్నూలు: పంచలింగాల టోల్‌గేట్‌ తెలంగాణ సరిహద్దు వద్ద ఏపీ అంబులెన్స్‌లపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. అంబులెన్స్‌ అపివేయటంతో చికిత్స అందక ఒకరు మృతి చెందారు. ఆర్టీఏ బోర్డర్‌ వద్ద మరికొన్ని అంబులెన్స్‌లు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసు అధికారులతో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ మాట్లాడారు. అంబులెన్స్‌లను పంపించేందుకు అధికారులతో కూడా ఎమ్మెల్యే చర్చలు జరిపారు. దీంతో అంబులెన్స్‌ను అనుమతించారు.

​​కాగా, పొరుగు రాష్ట్రాల నుంచి కోవిడ్‌–19 వైద్య సేవల కోసం తెలంగాణకు వస్తున్నవారిని అనుమతించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు రావాలంటే సదరు ఆస్పత్రి అంగీకారం తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. చికిత్స చేసేందుకు సానుకూలంగా ఉన్నట్టుగా ఆస్పత్రితో ముందస్తు ఒప్పందం చేసుకోవాలని పేర్కొంది. అనంతరం పోలీసు శాఖ అనుమతి కోసం కంట్రోల్‌ రూమ్‌కు వివరాలు సమర్పించి రసీదు తీసుకోవాలని సూచించింది.

చదవండి: ఇక తెలంగాణలో ప్రవేశానికి ఇవి తప్పనిసరి
లాక్‌డౌన్‌: సరిహద్దులు దిగ్బంధం..

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు