బీజేపీ సభ: సోమవారం ఉదయం వరకు ఆ రోడ్డు మూసివేత

3 Jul, 2022 09:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పరేడ్‌ నిర్వహించనున్న విజయసంకల్పసభకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సభ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. ఈ సభకు ప్రధాని మోదీ సహా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రముఖ నేతలు హాజరుకానున్నారు. 

కాగా, ప్రధాని మోదీ.. హెచ్‌ఐసీసీ నుంచి హెలికాప్టర్‌లో బేగంపేటకు చేరుకోనున్నారు. బేగంపేట నుంచి రోడ్డు మార్గంలో పరేడ్‌ గ్రౌండ్‌కు చేరుకుంటారు. సభ అనంతరం ప్రధాని మోదీ.. ఆదివారం రాత్రి రాజ్‌భవన్‌లో బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు రాజ్‌భవన్‌ రోడ్డును మూసివేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

కాగా, మోదీ పర్యటన సందర్భంగా పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేష్టన్‌ వైపు వెళ్లే వాహనాలు.. లోయర్‌ ట్యాంక్‌ బండ్‌, ముషీరాబాద్‌ మీదుగా దారి మళ్లించారు. ఉప్పల్‌, తార్నాక, చిలకలగూడ మీదుగా స్టేషన్‌కు వెళ్లాలని సూచించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ప్యాట్నీ మీదుగా బేగంపేట-పంజాగుట్ట రహదారిలో వాహనదారులు రావొద్దని పోలీసులు సూచించారు. సభ నేపథ్యంలో కార్లు, వాహనాల పార్కింగ్‌ కోసం ప్రత్యేకంగా ప్రాంతాలను కేటాయించారు. 

- జింఖానా గ్రౌండ్స్‌లో విఐపి పార్కింగ్.

- పరేడ్ గ్రౌండ్స్ సభాస్థలి సమీపంలో వివిఐపి పార్కింగ్‌.

- శామీర్‌పేట్, కరీంనగర్, సిద్దిపేట్ వారికి దోబిఘాట్‌లో పార్కింగ్.

- నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, సుచిత్ర, బాలనగర్ మీదుగా వచ్చేవారికి పోలోగ్రౌండ్స్‌లో పార్కింగ్‌.

- వరంగల్, నల్గొండ, ఉప్పల్ నుండి వచ్చే వారికి రైల్ నిలయంలో పార్కింగ్.

-మహాబూబ్‌ నగర్, రంగారెడ్డి, ట్యంక్ బండ్ వైపు నుండి వచ్చేవారికి నక్లెస్ రోడ్డులో పార్కింగ్.

మరిన్ని వార్తలు