కేసీఆర్‌ లేఖకు దిగొచ్చిన కేంద్రం.. నిరుదోగ్యులకు గుడ్‌న్యూస్‌

21 Jan, 2023 20:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిమాండ్‌కు ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. సీఎం కేసీఆర్‌ రాసిన లేఖ మేరకు కేంద్ర స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాంతీయ భాషల్లో పోటీ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. హిందీ, ఇంగ్లీష్‌తో పాటు అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. 

అయితే, సీఎం కేసీఆర్‌ నవంబర్‌ 18. 2020న ఈ అంశంపై ప్రధాని మోదీకి లేఖ రాశారు. భిన్న భాషలు, భిన్న సాంప్రదాయాలున్న దేశంలో ఫెడరల్ స్పూర్తిని కొనసాగించాలని కోరారు. రైల్వేలు, డిఫెన్స్‌, బ్యాంకులు తదితర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా చేపట్టే ఉద్యోగ నియామక పోటీ పరీక్షలను కేవలం హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో మాత్రమే నిర్వహించడం సరికాదన్నారు.

భిన్న భాషలున్న దేశంలో ఆయా రాష్ట్రాల స్థానిక భాషల్లోనే పరీక్షలు నిర్వహించి, దేశవ్యాప్తంగా నిరుద్యోగులు నష్టపోకుండా చూడాలని  కేంద్రాన్ని కోరారు. కాగా, కేసీఆర్ డిమాండ్ మేరకు హిందీ, ఇంగ్లీష్‌తో పాటు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో పొందుపరిచిన అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్నది. దీంతో, కేసీఆర్‌ కృషి ఫలించింది.

మరిన్ని వార్తలు