256 మంది పోలీసులకు ‘వర్టికల్‌’ అవార్డులు

1 Jun, 2022 01:58 IST|Sakshi
మాట్లాడుతున్న డీజీపీ మహేందర్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌ శాఖలో వర్టికల్‌ విధానాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న 256 మంది కానిస్టేబుల్, హోంగార్డులు, ఎస్‌ఐలు, ఇన్‌స్పెక్టర్‌లకు ఉత్తమ అవార్డులను డీజీపీ మహేందర్‌రెడ్డి అందించారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డు, కానిస్టేబుల్, ఇతర అధికారులు ఎవరు ఏ రోజు ఏ విధులు నిర్వర్తిస్తున్నారో తెలిసేది కాదని, తమ విధి ఏంటన్నది వారికి కూడా క్లారిటీ లేకుండా ఉండేదన్నారు.

కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అత్యాధునిక టెక్నాలజీ వినియోగం అందుబాటులోకి రావడంతో ప్రతి అధికారి జవాబుదారీతనంతో పనిచేస్తున్నారని, ప్రతి ఒక్కరికీ కచ్చితమైన డ్యూటీ ఉంటోందని వెల్లడించారు. కార్యక్రమంలోసీఐడీ డీజీపీ గోవింద్‌సింగ్, అదనపు డీజీపీలు రాజీవ్‌ రతన్, జితేందర్, నాగిరెడ్డి, సంజయ్‌కుమార్‌ జైన్, స్వాతిలక్రా తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు