టీఎస్‌ ఎంసెట్‌ అగ్రికల్చర్‌ ఫలితాలు విడుదల

24 Oct, 2020 15:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్‌ ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ టి. పాపిరెడ్డి శనివారం విడుదల చేశారు. పరీక్ష రాసిన 63,857 మంది అభ్యర్థులకు గాను 59,113 మంది క్వాలిఫై అయినట్లు పాపిరెడ్డి తెలిపారు. అర్హత సాధించిన అభ్యర్థులు ర్యాంకు కార్డులను www.sakshieducation.com వెబ్ సైట్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కాగా మెడిసిన్‌ అగ్రికల్చర్‌ విభాగంలో మొత్తం 79,978 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా.. గత నెల 28, 29వ తేదీల్లో నిర్వహించిన పరీక్షకు 63,856 మంది హాజరయ్యారు.  కాగా నవంబర్‌లో కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.

ఎంసెట్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ స్ట్రీమ్ లో టాప్ 10 రాంకులు వీరే..
1. గుట్టి చైతన్య సింధు... తెనాలి
2. సాయి త్రిషా రెడ్డి... సంగారెడ్డి
3. తుమ్మల స్నేహిత....హైదరాబాద్.
4. దర్శి విష్ణు సాయి..... నెల్లూరు.
5. మల్లిడి రిషి..... ఖమ్మం
6. మల్లిక్‌ చిగురుపాటి... మేడ్చల్
7. ఆవుల సుబాస్‌.... హైదరాబాద్.
8. గారపాటి గుణ చైతన్య... కర్నూల్
9. జి.వినయ కుమార్... చిత్తూరు
10. కోటావెంకట్.... కృష్ణా జిల్లా

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా