ఆస్పత్రి అంగీకరిస్తేనే  అనుమతి..  

14 May, 2021 02:10 IST|Sakshi

పొరుగు రాష్ట్రాల కరోనా బాధితుల ప్రవేశంపై సర్కారు స్పష్టీకరణ 

ఆస్పత్రితో ముందస్తు ఒప్పందం చేసుకున్నాకే రావాలని సూచన

సాక్షి, హైదరాబాద్‌: పొరుగు రాష్ట్రాల నుంచి కోవిడ్‌–19 వైద్య సేవల కోసం తెలంగాణకు వస్తున్నవారిని అనుమతించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందేందుకు రావాలంటే సదరు ఆస్పత్రి అంగీకారం తప్పనిసరిగా ఉండాలని స్పష్టంచేసింది. చికిత్స చేసేందుకు సానుకూలంగా ఉన్నట్టుగా ఆస్పత్రితో ముందస్తు ఒప్పందం చేసుకోవాలని పేర్కొంది. అనంతరం పోలీసు శాఖ అనుమతి కోసం కంట్రోల్‌ రూమ్‌కు వివరాలు సమర్పించి రసీదు తీసుకోవాలని సూచించింది.

040–24651119 లేదా 94944 38251 వాట్సాప్‌ లేదా ఐడీఎస్‌పీఎట్‌తెలంగాణ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌కు వివరాలను పంపాలని తెలిపింది. రోగి పేరు, వయసు, రాష్ట్రం, అటెండెంట్‌ పేరు, మొబైల్‌ నంబర్, రిజర్వ్‌ చేసిన బెడ్‌ టైప్‌ తదితర సమాచారాన్ని ఆస్పత్రి యాజమాన్యం కంట్రోల్‌ రూమ్‌కు పంపిస్తే.. వారికి అనుమతి పత్రాన్ని జారీ చేస్తామని వివరించింది. ఈ పత్రం ఆధారంగా రాష్ట్రంలో ప్రయాణించి ఆస్పత్రిలో చికిత్స పొందవచ్చని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.   

( చదవండి: వైరల్: కరోనా బాధితులతో డాన్స్‌ చేయించిన నర్సులు )

మరిన్ని వార్తలు