కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయండి: హైకోర్టు

16 Dec, 2020 16:38 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు అంశంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు బుధవారం విచారించింది. ఈ సందర్భంగా వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై రేపటి వరకు స్టే పొడిగించింది. కాగా పాత పద్దతిలో రిజిస్ట్రేషన్ చేస్తామని ప్రభుత్వం గతంలో హైకోర్టుకు చెప్పినప్పటికి అది అమలు కావడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది దేశాయి ప్రకాష్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై  వ్యక్తిగత వివరాలతో పాటు కొనుగోలుదారులు, అమ్మకందారుల కుటుంబ సభ్యుల వివరాలు అడగటంపై సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు.

అదే విధంగా.. ఆధార్ కార్డ్ వివరాలు తీసుకోవద్దని గతంలో చెప్పినప్పటికీ ప్రభుత్వం వివరాలు సేకరిస్తోందని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో విచారణ సందర్భంగా... ప్రభుత్వం కోర్టుకు చెపుతోంది, బయట ఇంకోటి చేస్తుందని హైకోర్టు వాఖ్యానించింది. పూర్తి వివరాలతో ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
 

మరిన్ని వార్తలు