కర్ణాటక ఐఫోన్ ప్లాంట్ ఘర్షణ; నష్టం రూ.52 కోట్లు

16 Dec, 2020 16:32 IST|Sakshi

బెంగళూరు: బెంగళూరు సమీపంలోని నరసపుర ఐఫోన్ ప్లాంట్ కర్మాగారంలో శనివారం జరిగిన ఘర్షణల్లో విస్ట్రాన్ కంపెనీ యొక్క వాస్తవానికి నష్టం 52 కోట్లు మాత్రమే అని తెలుస్తుంది. తైవాన్ కంపెనీ ఆపిల్ ఐఫోన్, ఇతర ఉత్పత్తులను తయారు చేస్తుంది. తైవాన్ కంపెనీ ఐఫోన్ ప్లాంట్ కర్మాగారంలో జరిగిన హింస కారణంగా ప్రధాన ఉత్పాదక పరికరాలు, గిడ్డంగులోని వస్తువులు ఎక్కువ నష్టం వాటిల్ల లేదని తెలిపింది. ప్రాథమిక అంచనాల ప్రకారం 100 మిలియన్ల నుండి 200 మిలియన్ల న్యూ తైవాన్ డాలర్(స్థానిక కరెన్సీ) నష్టం కలిగి ఉండవచ్చని అంచనా. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారు 52 కోట్ల రూపాయలుగా ఉండవచ్చు. (చదవండి: ఆపిల్ ఫ్యాక్టరీలో విధ్వంసం‌: రాజకీయ ప్రకంపనలు)

కానీ, కోలార్ పోలీస్ స్టేషన్ కు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం నష్టం 437కోట్ల రూపాయలని తెలిపింది. సంస్థ మొదట్లో నష్టాన్ని ఎక్కువగా అంచనా వేసిందా లేదా పోలీసులు తన నివేదికలో పొరపాటు చేశారా లేదా ఎక్కడైనా తప్పు జరిగిందా అనే దానిపై స్పష్టత లేదు. ఈ హింసాత్మక ఘటనలో మెటీరియల్‌కు ఎలాంటి నష్టం వాటిల్లలేదని.. దాదాపు రూ.52 కోట్ల నష్టం మాత్రమే వాటిల్లినట్లు తైవాన్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు విస్ట్రన్ సమాచారం ఇచ్చింది. కర్ణాటక కార్మిక శాఖ మంత్రి శివ్రామ్ హెబ్బర్ కంపెనీ ఫిర్యాదులో మాత్రం 437 కోట్ల రూపాయలను ఎందుకు పేర్కొంది అన్నారు. నష్టం ఎంతనేది పక్కనబెడితే.. ఇలాంటి ఘటనలను సమర్థించేది లేదన్నారు. ఈ ఘటనకు సంబంధించి 5 వేల మంది కాంట్రాక్టు వర్కర్లు సహా ఏడు వేల మందిపై కేసులు పెట్టినట్లు తెలుస్తోంది.
 

>
మరిన్ని వార్తలు