పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నాడు.. ఇక పెళ్లి కాదని

11 May, 2022 08:56 IST|Sakshi

తలమడుగు (ఆదిలాబాద్‌): పెళ్లి సంబంధాలను చెడగొడుతున్నాడు, ఇక తనకు పెళ్లి కాదేమోనని మనస్తాపంతో పురుగుల మందు తాగిన యువతి చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని రుయ్యడి గ్రామనికి చెందిన కుమ్మరి శ్రీనీల(19)ని అదే గ్రామానికి చెందిన చెన్నల సాయి కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు.

విషయం తెలిసి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడగా, వాటిని చెడగొట్టాడు. దీంతో మనస్తాపం చెందిన శ్రీనీల ఫిబ్రవరి 28న ఇంట్లోని యాసిడ్, సూపర్‌వాస్మాల్‌ తాగింది. కుటుంబ సభ్యులు చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది. శ్రీనీల తండ్రి శేఖర్‌ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవళిక తెలిపారు.  

చదవండి: (Hyderabad: వ్యభిచార గృహంపై దాడి.. ఐదుగురి అరెస్టు)

మరిన్ని వార్తలు