పుదుచ్చేరి–సంత్రగచ్చి (కోల్‌కతా) మధ్య 26 ప్రత్యేక రైళ్లు

4 Mar, 2017 04:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పుదుచ్చేరి –సంత్రగచ్చి (కోల్‌కతా) మధ్య 26 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. పుదుచ్చేరి–సంత్రగచ్చి (06010) ప్రత్యేక రైలు ఏప్రిల్‌ 1, 8, 15, 22, 29, మే 6, 13, 20, 27, జూన్‌ 3, 10, 17, 24 తేదీల్లో నడుస్తుంది. సంత్రగచ్చి–పుదుచ్చేరి (06009) రైలు ఏప్రిల్‌ 3, 10, 17, 24, మే 1, 8, 15, 22, 29, జూన్‌ 5, 12, 19, 26 తేదీల్లో  నడుపుతారు.

16 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు బోగీలు: వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయా ణీకుల సౌకర్యార్ధం మార్చి 5 నుంచి జూన్‌ 1 వరకు 22 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. గుంటూరు– వికారాబాద్‌ (పల్నాడు), విజయవాడ–సికింద్రాబాద్‌ (శాతవాహన), విజయ వాడ–చెన్నై (పినాకిని), విజయవాడ–విశాఖపట్టణం (రత్నా చల్‌), సికింద్రా బాద్‌ – గుంటూరు (ఇంటర్‌ సిటీ), సికింద్రాబాద్‌ –కర్నూల్‌ టౌన్‌ (తుంగ భద్ర), సికింద్రాబాద్‌–విజయవాడ (ఇంటర్‌ సిటీ), తిరుపతి–ఆదిలాబాద్‌ (కృష్ణా) రెండు వైపులా నడిచే రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేస్తారు.

మరిన్ని వార్తలు