పంజాగుట్టలో అగ్రిగోల్డ్ ఆఫీస్ వద్ద ఆందోళన

5 May, 2015 09:58 IST|Sakshi

హైదరాబాద్ : అగ్రిగోల్డ్ బాధితులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. హైదరాబాద్ పంజాగుట్టలోని అగ్రిగోల్డ్ కార్యాలయం వద్ద డిపాజిట్దారులు, ఏజెంట్లు మంగళవారం ఆందోళనకు దిగారు. తమ డిపాజిట్ చేసిన సొమ్ము వెనక్కి ఇవ్వాలంటూ బాధితులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని ఆపేది లేదని వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

కాగా చెల్లింపుల్లో ఇటీవల జరుగుతున్న జాప్యం.. కొందిరికి ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడం.. సంస్థ విజయవాడ కార్యాలయంలో సీబీఐ సోదాలు.. తదితర పరిణామాలు అగ్రిగోల్డ్ సంస్థ ఖాతాదారుల్లో అలజడి, ఆందోళనకు కారణమయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక,ఒడిశాలో ఉన్న ఖాతాదారులు పెద్దసంఖ్యలో ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్న విషయం తెలిసిందే.

అగ్రిగోల్డ్ సంస్థలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన ఖాతాదారులకు కాలపరి మితి ముగిసిన తర్వాత సొమ్ము చెల్లింపులో కొన్ని నెలులుగా తీవ్ర జాప్యం జరుగుతోంది. గట్టిగా అడిగిన వారికి చెక్కులిచ్చి పంపిస్తున్నారు. వాటిని బ్యాం కులో వేస్తే సంస్థ ఖాతాలో సొమ్ము లేక తిరిగి వచ్చేస్తున్నాయి. తమను మోసం చేసి బోర్డు తిరగేసేందుకు సంస్థ ప్రయత్నిస్తోందని పలువురు ఆరోపించారు.

మరిన్ని వార్తలు