టాస్క్ ఫోర్స్ దాడుల్లో బెంగాలీ నటి అరెస్ట్

8 May, 2014 19:04 IST|Sakshi
టాస్క్ ఫోర్స్ దాడుల్లో బెంగాలీ నటి అరెస్ట్
హైదరాబాద్‌: నగరంలో టాస్క్ ఫోర్స్ జరిపిన దాడుల్లో బెంగాల్ నటి సుకన్య చటర్జీ వ్యభిచారం కేసులో  పట్టుబడింది. గురువారం మధ్యాహ్నం జూబ్లిహిల్స్ లోని ఓ హెటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బెంగాల్‌ నటి సుకన్యతోపాటు మరో ఇద్దరి అరెస్ట్ చేశారు.
 
జూబ్లీహిల్స్ లోని ఓ హోటల్ లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బెంగాల్ నటిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సుకన్యతోపాటు నగరానికి చెందిన పవన్, దీపక్ లిద్దరి కూడా అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.
 
అరెస్ట్ చేసిన సుకన్యను బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. బెంగాల్ చిత్రాల్లో నటించిందని.. గత రెండు రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు