బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ

20 Apr, 2016 02:19 IST|Sakshi

రోడ్డున పడ్డ బాధితులు
రూ.50 లక్షలతో ఉడాయించిన యజమాని

 
తిరుపతిక్రైం: నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని ఆశచూపించి వారి వద్ద లక్షలాది రూపాయలు దోచుకుని బోర్డు తిప్పేసిన సాఫ్ట్‌వేర్ కంపెనీ బాగోతం మంగళవారం తిరుపతిలో వెలుగులోకి వచ్చింది. ఈస్టు సీఐ రామ్‌కిషోర్  వివరాల మేరకు.. వీవీ మహల్ రోడ్డులో  వెరిజోటెక్ ఐటీ సొల్యూషన్ కంపెనీ నిర్వహించేవారు. మేనేజింగ్ డెరైక్టర్, చైర్మన్‌గా విశాఖపట్నానికి చెందిన విశ్వప్రసాద్ వ్యవహరించేవాడు. 2015లో స్థాపించి 91 మందికి కోర్సులు నేర్పిం చి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశచూపిం చాడు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10 వేల నుంచి లక్ష వరకు వసూలు చే శాడు. సుమారు రూ.60 నుంచి 70 లక్షలకు పైగా వసూలు చేశాడు. మొదటగా చేరిన వారికి ఆ సంస్థలో ఉన్న జావా, ఎక్స్ ఎంఎల్ సర్వీసెస్, సీవీఎస్ తదితర కోర్సులు నేర్పించి వారికి సంవత్సరానికి రూ.3 నుంచి 4 లక్షల వరకు ప్యాకే జీ ఇప్పిస్తామని నమ్మించి కోర్సులో చేర్పించుకునేవాడు. అలా నమ్మి చేరితే కోర్సుకు మొదటగా రూ.10 వేలు చెల్లిం చాలి. ఇదిపూర్తి అయిన వెంటనే  ఆఫర్‌లెటర్ ఇచ్చి లక్షల్లో వసూలు చేసేవారు.


అయితే ఇలా ఆఫర్ లెటర్లు ఇచ్చినవారికి బెంగళూరులో తమ సంస్థ ఉందని నమ్మించేవారు. ఇలా నమ్మిన బాధితులు మోసపోయి రోజు ఆఫీసు చుట్టూ తిరగలేక మంగళవారం తిరుపతిలోని న్యూ ఇందిరా నగర్‌లో నివాసముం టున్న హరిప్రసాద్ ఈస్టు పోలీసులకు జరిగిన విషయాన్ని తెలిపి ఫిర్యాదు చేశాడు. పోలీసులు సాఫ్ట్‌వేర్ కంపెనీలో సోదాలు నిర్వహించి దానిని నిర్వహిం చిన యజమాని కోసం ఆరా తీశారు. అక్కడ పనిచేసేవారు యజమాని కొద్దిరోజుల నుంచి కనిపించడంలేదని సమాచారం ఇచ్చారు. ఈ సోదాలలో 91 మంది బాధితుల బయోడేటాలు, కంపెనీకి సంబంధించిన ఫ్యూచర్ ప్లాన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  అయితే ఆ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్లు కూడా ఏదీ కూడా పనిచేయదని కనీసం ఓ ఫ్యాన్ కూడా తిరగదన్నారు. కేవలం నిరుద్యోగులను మోసం చేసేందుకే ఒక కార్యాలయంగా చిత్రీకరించనట్టు తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ఈస్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఓ బాధితుడు మాత్రమే ఫిర్యాదు చేశాడు. ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో అంచనా వేయలేక పోతున్నారు.  దీనిపై పోలీసులు కేసు నమో దు చేసి నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు