‘తెలుగువారు వచ్చేందుకు రంగం సిద్ధం’

10 May, 2020 13:50 IST|Sakshi

సాక్షి, విజయవాడ: విదేశాల్లో ఉ‍న్న తెలుగువారు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేందుకు మార్గం సుగమమైందని కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్ అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. విదేశాల్లో ఉన్న సుమారు 30 వేల మందిని రాష్ట్రానికి తీసుకురావటానికి రంగం సిద్ధం చేశామని అన్నారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయని ఆయన చెప్పారు. రేపు మొదటి విమానం విదేశాల నుంచి విజయవాడ విమానాశ్రయానికి రానుందని ఆయన తెలిపారు. అందులో మొదటిగా 19మంది  రానున్నారని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. రానున్న రెండు వారాలలో జిల్లాకు మూడు నుంచి నాలుగు వేల మంది వస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. వారికి  రెండు ఆప్షన్లు ఇస్తున్నామని ఆయన చెప్పారు. (సీఎం వైఎస్‌ జగన్‌ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు)

గవర్నమెంట్ క్వారంటైన్‌, పెయిడ్ క్వారంటైన్లను సిద్ధం చేశామని కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. ఇందుకోసం జిల్లాలోని వివిధ హోటల్స్‌లో వెయ్యి గదులను సిద్ధం చేశామని ఆయన అన్నారు. 14 రోజులు క్వారంటన్‌లో ఉండటం తప్పనిసరి ప్రోటోకాల్ అని కలెక్టర్‌ ఇంతియాజ్‌ వివరించారు. వచ్చేవారిని ఎయిర్‌పోర్టు దగ్గర పర్యవేక్షించటం కోసం ఒక బృందాన్ని, ప్రత్యేక మైన స్క్రినింగ్, ఏ జిల్లా వారైతే ఆ జిల్లాకు పంపేలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. హైదరాబాద్‌కు కూడా ఒక అధికారుల బృందాన్ని పంపామని, అక్కడి ఎయిర్‌పోర్టు నుంచి వచ్చేవారిని సైతం తీసుకువచ్చేలా చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. (‘బాబు తప్పిదాల వల్లే ఈ ప్రమాదం’)

జిల్లాలో 32 క్వారంటైన్ సెంటర్లలో ఐదు వేల బెడ్లు ఉన్నాయని  క్వారంటైన్ సెంటర్లలో నాణ్యమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైఎస్‌‌ జగన్‌‌ ఆదేశించారని కలెక్టర్‌ తెలిపారు. ఒక్క వ్యక్తికి రోజుకు రూ. ఐదు వందల నాణ్యమైన ఆహారాన్ని అందించనున్నామని ఆయన తెలిపారు. క్వారంటైన్ సెంటర్‌లో ఆహారం తీసుకున్న వారి స్పందన బాగుందని ఆయన తెలిపారు అదే మెనూను హోటల్స్‌కు కూడా ఇవ్వనున్నాము కలెక్టర్‌ చెప్పారు. గల్ఫ్ దేశాల నుంచి వచ్చేవారు జిల్లాలో ఎవరులేరని, యూఎస్‌, యూరప్‌ నుంచి ఎక్కువ మంది జిల్లాకు రానున్నారని కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ తెలిపారు. (ఏపీకి వచ్చేందుకు 30 వేల మంది రిజిస్ట్రేషన్‌)

మరిన్ని వార్తలు