కలెక్టర్ సతీమణి జిల్లాకు బదిలీ

12 Dec, 2013 03:47 IST|Sakshi

సాక్షి, కరీంనగర్ : జిల్లా కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య సతీమణి విజయలక్ష్మి బదిలీపై జిల్లాకు వస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్‌గా ఉన్న ఆమెను..

 

కోనేరు రంగారావు కమిటీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీరబ్రహ్మయ్య ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్‌లో చికిత్స పొందారు. ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయిన ఆయన ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. వారం రోజుల్లో ఆయన విధులకు హాజరుకానున్నారు. ఆయన అనారోగ్యం కారణంగా విజయలక్ష్మిని బదిలీ చేయాలని నిర్ణయించారు.
 

మరిన్ని వార్తలు