రాజీనామా లేఖలతో సిఎల్పికి వెళ్లిన నేతలు

1 Aug, 2013 17:47 IST|Sakshi

హైదరాబాద్: సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు రాజీనామా లేఖలు తీసుకొని సిఎల్పి కార్యాలయానికి వెళ్లారు. కొందరు రాజీనామా లేఖలను స్పీకర్ ఫార్మాట్లోనే తీసుకువచ్చారు. కొందరు అలా  కాకుండా రాష్ట్ర విభజనకు నిరసన తెలుపుతూ ఇవ్వాలని, మరి కొందరు రాజీనామా లేఖలను నేరుగా స్పీకర్ ఇవ్వడం మంచిదికాదని  అంటున్నారు. చివరకు అసెంబ్లీ కార్యదర్శికి ఇవ్వాలని నిర్ణయించారు.

సిఎల్పీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించడం అంటే చాలా పెద్ద సమస్య అన్నారు. ఇతర ఎమ్మెల్యేలు మాట్లాడుతూ నియోజకవర్గాలలో  తిరిగే పరిస్థితి లేదని, తమ రాజీనామాలు ఆమోదించాలని వారు కోరుతున్నారు.  

తణుకు ఎమ్మెల్యే కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ  రాజీనామాలను స్పీకర్ ఫార్మట్‌లో పీసీసీ చీఫ్‌కు ఇస్తామని చెప్పారు. సమస్యను అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లేందుకే రాజీనామాలు బొత్సకు ఇస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు