మదర్‌థెరిసా విద్యార్థినికి బంగారు పతకం

17 Nov, 2017 08:11 IST|Sakshi
రోహిత

గంగవరం: మండలంలోని మదర్‌థెరిసా ఇంజినీరింగ్‌ విద్యార్థిని రోహిత బంగారు పతకం సాధించినట్లు కళాశాల కరస్పాండెంట్‌ రవీంద్రబాబు తెలిపారు. ఐదు జిల్లాల్లోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో తమ కళాశాలకు ఈ పతకం రావడం హర్షదాయకమన్నారు. కళాశాలలో 2013– 17 బ్యాచ్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివిన రోహిత 86.01శాతం మార్కులతో జేఎన్‌టీయూ పరిధిలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు.  విద్యార్థినిని కళాశాల యాజమాన్యం రాజేంద్రరెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి అభినందించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా