వైభవం.. కల్యాణ వెంకన్న గరుడోత్సవం

1 Oct, 2014 03:14 IST|Sakshi
వైభవం.. కల్యాణ వెంకన్న గరుడోత్సవం

తిరుపతి రూరల్: వేలాది మంది భక్తుల గోవిందనామ స్మరణ నడుమ తుమ్మలగుం టలోని కళ్యాణ వెంకన్న గరుడోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. మధ్యాహ్నం నుంచే తుమ్మలగుంటకు భక్తులు తరలివచ్చారు. కోలాటాలు, చెక్కభజనలు, పిల్లనగ్రోవులు, కేరళా వాయిద్యాలు, గోవిందమాల భక్తుల గోవిందనామస్మరణల మధ్య స్వామి వారి గరుడ సేవ కన్నుల పండువగా సాగిం ది. పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలు, విశేష పు ష్పాలంకరణతో ముస్తాబైన కల్యాణ వెంకన్న గరుడునిపై కొలువై భక్తులకు కనువిందు చేశారు.

వాహన సేవ ముందు కళాకారుల సాం స్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతకు ముందు ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. వాహన మండపంలో కొలువుంచి శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారిని అభిషేకించారు. ఉద యం 7 గంటలకు కల్యాణవెంకటేశ్వరుడు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన వేద పండితుల వేద పారాయణం, కళాకారుల సంకీర్తన నడుమ స్వామి వారి ఊంజల్ సేవ కనుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త , చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సర్పంచ్ జయలక్ష్మి, ఉపసర్పంచ్ గోవిందరెడ్డి, ఆలయ ఈవో సుబ్బరామిరెడ్డి, మాజీ సర్పంచ్ జయచంద్రారెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఏసీ వెంకటప్ప, ఆలయ వాహన ఇన్‌స్పెక్టర్ బాబురెడ్డి, ప్రకాష్, భక్తులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో నేడు
కల్యాణ వెంకన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 7 గంటలకు హ నుమవాహనం, సాయంత్రం 7 గంటలకు గజవాహనంపై స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఆల యం ముందు వసంతోత్సవం, 6 గంటలకు ఊంజల్ సేవ నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు