పెళ్లయిన రెండురోజులకే.. పెళ్లికొడుకు మృతి

14 Mar, 2015 17:56 IST|Sakshi

రాజంపేట: వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలంలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. పుల్లంపేటకు చెందిన రమణారెడ్డి (25)కి ఈనెల 12వ తేదీన వివాహం అయింది.

శనివారం సాయంత్రం అతడు తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఊట్కూరు గ్రామ సమీపంలో లారీ ఢీకొంది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. వివాహం జరిగి రెండు రోజులైనా కాకముందే పెళ్లికొడుకు మృత్యువాత పడడంతో కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

మరిన్ని వార్తలు