అసభ్యకరంగా మాట్లాడాడని..

27 Aug, 2019 07:50 IST|Sakshi
న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న సన్యాసినాయుడు కుటుంబ సభ్యులు

ఆందోళన చేసిన మృతుడి కుటుంబ సభ్యులు

ఐదుగురిపై కేసు నమోదు 

సాక్షి, బుచ్చెయ్యపేట(చోడవరం): తమ కుమార్తెతో అసభ్యకరంగా మాట్లాడాడని ఆగ్రహించిన మండలంలో రాజాం గ్రామంలో బాలిక కుటుంబ సభ్యులు దాడి చేయడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య కన్నమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. తన పొలంలో వరి పంటకు తెగుళ్లు సోకడంతో పురుగుమందు స్ప్రేయర్‌ కోసం రాజాం గ్రామానికి చెందిన ఏడువాక సన్యాసినాయుడు(40) అదే గ్రామానికి చెందిన మరిసా రాజులమ్మ ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో రాజులమ్మ ఇం టి వద్ద లేకపోగా ఆమె 13 సంవత్సరాల కుమార్తెను స్ప్రేయర్‌ ఇవ్వమని సన్యాసినాయుడు అడిగాడు. ఇంటివద్ద మా కుటుంబ సభ్యులు లేర ని, తరవాత రమ్మని రాజులమ్మ కుమార్తె తెలి పింది. సాయంత్రం ఇంటికి వచ్చిన  రాజులమ్మకు తనతో సన్యాసినాయుడు అసభ్య పదజాలంతో మాట్లాడినట్టు బాలిక తెలిపింది.

 సన్యాసినాయుడుతో బాలిక తల్లి,కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి గొడవ పడి, అతనిపై దాడి చేశారు. ఆ సమయంలో సన్యాసినాయుడు రోడ్డుపై పడడంతో తలకి గాయమై అక్కడకక్కడే మృతి చెందాడు.  సంఘటన సమాచారం తెలిసిన వెంటనే అనకాపల్లి డీఎస్పీ శ్రావణి,చోడవరం సీఐ కె.ఈశ్వరరావు, బుచ్చెయ్యపేట పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి, మృత దేహాన్ని చోడవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.మృతుడి భార్య కన్నమ్మ ఆమె కుటుంబ సభ్యులు సోమవారం గ్రామంలో ఆందోళనకు దిగారు. చిన్న విషయానికే ప్రాణాలు తీసేస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. తన భర్త చావుకు కారణమైన బాలిక తల్లి రాజులమ్మ,బాబాయి శ్రీను,నానమ్మ అప్పలకొండ కుటుంబ సభ్యులు సత్యవతి,సన్యాసినాయుడులపై చర్యలు తీసికోవాలని కన్నమ్మ ఫిర్యాదు చేయడంతో ఆ ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. సన్యాసినాయుడు మృత దేహానికి పంచనామా నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఊపిరి ఉన్నంత వరకు వైఎస్సార్‌సీపీలోనే.. 

నిత్యం భయం.. జీవనం దుర్భరం

రేపు విశాఖకు ఉప రాష్ట్రపతి రాక

రూ. 20 లక్షల ఎర్రచందనం దుంగలు స్వాధీనం

పోర్టులో మరో ప్రమాదం

‘అధిపతులు’ వ్యవహరించాల్సింది ఇలాగేనా!

రాజధానిలో ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌

నదుల అనుసంధానానికి ప్రత్యేక అథారిటీ

రూ.30 వేల కోట్లు ఇవ్వండి

మత్స్యకారులే సైనికులు..

వైఎస్సార్‌ వర్ధంతి రోజున సేవా కార్యక్రమాలు

ప్రమాణాలు లేకపోతే మూతే!

యరపతినేని అక్రమ మైనింగ్‌పై కేంద్ర దర్యాప్తు కోరవచ్చుగా?

పారదర్శక ఆలయాలు!

సమగ్రాభివృద్ధే మందు

జాబిల్లి సిత్రాలు

అమిత్‌ షాతో సీఎం జగన్‌ భేటీ

ఈనాటి ముఖ్యాంశాలు

సమావేశం ఫలప్రదం; కేంద్రానికి ఏపీ సూచనలు

పవన్‌ కల్యాణ్‌ చాలా చెప్పారు.. ఏం చేశారు?

‘రీటెండరింగ్‌ ద్వారనే ‘పోలవరం’ పనులు’

తెలుగు రాష్ట్రాలకు అమిత్ షా ప్రశంస

ప్రేమ పేరుతో మైనర్‌ బాలిక ట్రాప్‌..!

శ్రీశైలంలో అన్యమత ఉద్యోగులు

ఆమెను సీఎం జగన్‌ స్టీల్‌ లేడీ అని పిలుస్తారు..

యరపతినేని మైనింగ్‌ కేసులో హైకోర్టు కీలక సూచన

మావోయిస్టు ప్రాంతాలపై కేంద్ర హోంశాఖ సమీక్ష

నేనే రాజు.. నేనే బంటు

తిరుమలలో దళారీల దండయాత్ర

వాసిరెడ్డి పద్మ ప్రమాణ స‍్వీకారం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మరో సినిమాతో వస్తా!

కౌసల్య కృష్ణమూర్తి చేయడం అదృష్టం

కీర్తీ... మిస్‌ ఇండియా

నవ్వుల్‌ నవ్వుల్‌

మంచి సందేశంతో మార్షల్‌

చీమ మనిషిగా మారితే...!