‘వదంతులు నమ్మొద్దు.. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ’

24 Aug, 2019 11:14 IST|Sakshi

చింతలపూడి ఎమ్మెల్యే ఏలీజా

సాక్షి, జంగారెడ్డి గూడెం: గ్రామ సచివాలయ ఉద్యోగాల ఎంపిక పారదర్శకంగా జరుగుతాయని... వదంతులు నమ్మొద్దని చింతలపూడి ఎమ్మెల్యే ఏలీజా అన్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో గ్రామ సెక్రటేరియట్‌ ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు. ఇంటికొక ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి నాలుగు లక్షల వాలంటీర్ల పోస్టులు భర్తీ చేయడంతో పాటు లక్షా ఇరవై ఏడు వేల గ్రామ సెక్రటేరియట్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారని తెలిపారు.

జంగారెడ్డిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే ఏలీజా ఆకస్మిక తనిఖీ చేశారు. ఎటువంటి సదుపాయాలు అందుతున్నాయో విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి ఆయన అల్పహారం చేశారు. ఎమ్మెల్యే వెంట పొల్నాటి బాబ్జి, పిపియన్ చంద్రరావు, ఇతర నాయకులు ఉన్నారు.


 

మరిన్ని వార్తలు