సీమాంధ్ర నుంచే తెలంగాణకు నక్సలిజం

17 Nov, 2013 01:22 IST|Sakshi
సీమాంధ్ర నుంచే తెలంగాణకు నక్సలిజం

టీఆర్‌ఎస్ నేత పేర్వారం వ్యాఖ్య
 
 సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రాంతం నుంచే తెలంగాణకు నక్సలిజం వచ్చిందని మాజీ డీజీపీ, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు పేర్వారం రాములు వ్యాఖ్యానించారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. పశ్చిమబెంగాల్‌లో పుట్టిన నక్సలిజం సీమాంధ్రకు ముందుగా చేరిందన్నారు. 1980 ప్రాంతంలో సీమాంధ్ర నుంచి వరం గల్ జిల్లాకు వలస వచ్చి అక్రమంగా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందినవారే నక్సలిజాన్ని వ్యాపింపజేశారని ఆరోపించారు.
 
 1980కు ముందు తెలంగాణలో నక్సలిజమే లేదని, ఈ విషయం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డికి తెలియదా? అని పేర్వారం ప్రశ్నించారు. అప్పటి నుంచి తెలంగాణలో జరిగిన విధ్వంసం, ప్రాణ, ఆస్తినష్టం సామాన్యమైనది కాదన్నారు. సీమాంధ్ర వలసవాదులు వ్యాపింపజేసిన నక్సలిజం నుండి విముక్తి కావడానికి తెలంగాణకు 20 ఏళ్లు పట్టిందన్నారు. ఇప్పుడు తెలంగాణలో నక్సలైట్ల రిక్రూట్‌మెంట్ లేదని.. దీనిని సాధికారికంగా, గర్వంగా చెప్తున్నానన్నారు. సరైన అక్షరాస్యతతో ఉన్నత ఉద్యోగావకాశాలు రావడం, కుల సంఘాల ప్రభావం వంటివాటి వల్ల నక్సలిజం వైపు ఆకర్షణ తగ్గిందన్నారు. ఇప్పుడు 60 ఏళ్లు దాటినవారు తప్ప యువత నక్సలైట్లలో లేదన్నారు. గతంలో తాను వరంగల్ జిల్లాలోని ఊరికి పోతే వందల పోలీసులు రక్షణగా ఉండాల్సి వచ్చేదని... ఇప్పుడైతే ఒకే గన్‌మన్‌తో వెళ్తున్నట్టు చెప్పారు. ఐనా నక్సలిజం తెలంగాణకే పరిమితమైన సమస్యగా చిత్రీకరించే కుట్రకు సీమాంధ్రులు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇవన్నీ ఆంజనేయరెడ్డికి తెలియకుండానే మాట్లాడుతున్నాడా? అని ప్రశ్నించారు.
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఎన్‌ఎంసీ బిల్లు.. వైద్యవిద్యకు చిల్లు

క్రిమినల్స్‌ను ఏరిపారేద్దాం..!

ఈ 'రూటే' సపరేటు!

నకిలీ నోటు.. ఇట్టే కనిపెట్టు

ఆగస్టు 8న జిల్లాకు ముఖ్యమంత్రి 

నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

రైతుల ఆత్మహత్యలకు కారణం చంద్రబాబే..

'చంద్రబాబు మళ్లీ సీఎం కాలేరు'

అనారోగ్యంతో గిరిజన విద్యార్థి మృతి

ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం

మహిళా రోగిపై అసభ్యకర ప్రవర్తన

వారి సంగతేంటో తేల్చండి..

ఈ చిన్నారికి ఎంత కష్టం 

రూ.25.86 లక్షల జరిమానా

సబ్‌ రిజస్ట్రార్‌ కార్యాలయంపై.. ఏసీబీ దాడి

నంద్యాల యువతి హైదరాబాద్‌లో కిడ్నాప్‌? 

అశోక్‌ లేలాండ్‌పై ఆగ్రహం

అక్టోబర్‌ 2 నుంచి అర్హులకు రేషన్‌ కార్డులు

విశాఖ అద్భుతం

చంద్రబాబుకున్న ‘జెడ్‌ ప్లస్‌’ను కుదించలేదు

‘నీరు– చెట్టు’ అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ ప్రారంభం 

నాయకత్వం లోపంతోనే ఓడిపోయాం

అమరావతిలో క్యాన్సర్‌ ఆస్పత్రి ఏర్పాటు చేయాలి

ఎమ్మెల్సీ వాకాటి ఇంట్లో సీబీఐ సోదాలు

స్థిరాస్తులకు కొత్త రేట్లు

టీడీపీ సర్కార్‌ పాపం వైద్యులకు శాపం..!

వాన కురిసే.. సాగు మెరిసే..

బిరబిరా కృష్ణమ్మ.. గలగలా గోదావరి

27 మంది ఖైదీలకు ఎయిడ్సా?

జగన్‌ది జనరంజక పాలన

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హీరో కథా చిత్రాల్లో నటించమంటున్నారు

బెల్లంకొండపై..అరెస్ట్‌ వారెంట్‌

శ్రీదేవి కల నెరవేరనుందా?

మళ్లీ బిజీ అవుతున్న సిద్ధార్థ్‌

అలాంటి సినిమాల్లో అస్సలు నటించను : రష్మిక

హీరోపై సినీనటి తల్లి ఫిర్యాదు..