అమెరికాకు ఎన్టీఆర్ విగ్రహం

12 May, 2015 09:30 IST|Sakshi
అమెరికాకు ఎన్టీఆర్ విగ్రహం

కొత్తపేట: విశ్వవిఖ్యాత నట సౌర్వభౌముడిగా కీర్తి గడించిన ఎన్టీ రామారావు కృష్ణావతార పంచలోహ విగ్రహం తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలోని డి.రాజ్కుమార్ వుడయార్ శిల్పశాలలో రూపుదిద్దుకుంది. అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వెస్ట్ కొవిన్ (కాలిఫోర్నియా)లోని పార్కులో నెలకొల్పేందుకు ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు వుడయార్ తెలిపారు.

విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు శరత్ బి కామినేని దీని రూపకల్పనకు ఆర్డర్ ఇచ్చారని తెలిపారు. జూలైలో తానా సభల సందర్భంగా ఆవిష్కరించనున్న ఈ ఎనిమిదడుగుల విగ్రహాన్ని 80 కిలోల పంచలోహాలతో తయారు చేసినట్లు చెప్పారు. విగ్రహాన్ని బుధవారం విమానంలో అమెరికా పంపించనున్నారు.

మరిన్ని వార్తలు