శివథాను పిళ్లెకి గీతం యూనివర్సిటీ అవార్డు

6 Aug, 2015 19:54 IST|Sakshi

సాగర్‌నగర్ (విశాఖ): గీతం విశ్వవిద్యాలయం 35వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది గీతం ఫౌండేషన్ అవార్డును సుప్రసిద్ధ శాస్త్రవేత్త బ్రహ్మాస్ క్షిపణి రూపశిల్పి డాక్టర్ ఎ.శివథాను పిళ్లైకి అందజేయనున్నట్టు వర్సిటీ వైస్ చాన్స్లర్ ఆచార్య జి. సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఈనెల 8న విశాఖలో గీతం వ్యవస్థాపక దినోత్సవంలో గీతం అధ్యక్షుడు డాక్టర్ ఎం.వి.వి.ఎస్.మూర్తి పిళ్లైలకి ఈ అవార్డుతో పాటు రూ. పది లక్షల నగదు బహుమతిని అందజేస్తారు.

భారత రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి అవసరమైన పరిశోధనను జరపడమేకాక భారత్ - రష్యా ఉమ్మడి ప్రాజెక్టు అయిన బ్రహ్మాస్ ఏరో స్పేస్ ప్రాజెక్టుకు మేనేజింగ్ డెరైక్టర్‌గా పిళ్లై వ్యవహరించారు. భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తగా ఆయన విశిష్ట సేవలు అందించి, భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ విశిష్ట శాస్త్రవేత్తగా ఆయన వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వార్తలు