నూనెకు సుంకం సెగ

2 Apr, 2018 11:56 IST|Sakshi

పామాయిల్, సన్‌ఫ్లవర్‌ ధర కిలోకు రూ.10 పెరుగుదల

దిగుమతి సుంకం పెంపు

కాకినాడ, కృష్ణపట్నం     రేవుల్లో ఆగిన దిగుమతులు

అన్ని రకాల నూనెల ధరలపై తీవ్ర ప్రభావం

శ్రీకాకుళం: నూనెల ధరలు మండిపోతున్నాయి. దిగుమతులపై సుంకాన్ని కేంద్రం పెంచుతుండటంతో పామాయిల్, సన్‌ఫ్లవర్‌ నూనెల ధరలు ని ప్పులు కక్కుతున్నాయి. కిలో నూనెపై ఒక్కరోజులో రూ.10 పెరిగింది. డబ్బా పరంగా (15 కిలోలు) చూసుకుంటే రూ. 150 పెరిగింది. నూనెల మార్కె ట్‌ చరిత్రలో ఇంత పెరుగుదల కనిపించడం ఇదే ప్రథమం. మలేషియా నుంచి రాష్ట్రంలోని కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల మీదుగా పామ్‌క్రూడ్‌ (శుద్ధి చేయని పామాయిల్‌), పామాయిల్‌ (రిఫైన్డ్‌ చేసిన పామాయిల్‌), సన్‌ఫ్లవర్‌ నూనె దిగుమతి అవుతోంది. దిగుమతులను ప్రోత్సహించే క్రమంలో 200 శాతం ఉన్న సుంకాన్ని గత యూపీఏ ప్రభుత్వం క్రమేణా తగ్గించుకుంటూ వచ్చింది. చివరకు దిగుమతి సుంకం జీరోకు చేరుకుంది.

దేశంలో పా మాయిల్‌ సాగు విస్తరించడం, విదేశాల నుంచి ఈ నూనెను దిగుమతి చేసుకుంటే దేశీయ రైతులకు నష్టం వాటిల్లుతుందనే కారణంగా కేంద్రం ఇటీవల పామ్‌క్రూడ్‌ దిగుమతులపై సుంకాలు విధించడం మొదలైంది. 12 శాతంగా మొదలై 30 శాతానికి చేరుకుంది. బుధవారం నుంచి ఇది మరింత ఎగసి 44 శాతానికి పెరిగింది. దీనిపై సంక్షేమ సర్‌చార్జీలు 4.4 శాతం కలిపితే దిగుమతి సుంకం 48.4 శాతా నికి చేరుకుంది. ఈ ప్రభావం నేరుగా ధరపై పడి ఒక్కరోజులో కిలో పామాయిల్‌ ధర రిటైల్‌ మార్కెట్‌లో రూ.10 పెరిగి రికార్డు సృష్టించింది. రిఫైన్డ్‌ బ్లీచ్డ్‌ డీ ఆక్సైడ్‌ ఆయిల్‌ (డీబీడీ) శుద్ధి చేసిన పామాయిల్‌ దిగుమతులపై కూడా సుంకాలు పెరిగాయి. 40 శాతంగా ఉన్న దిగుమతి సుంకం 59.40 శాతానికి చేరుకుంది. దీంతో కనీవినీ ఎరుగని రీతిలో పామాయిల్, సన్‌ఫ్లవర్‌కు, ఇతర నూనెల ధ రలకు రెక్కలు వచ్చాయి. పది కిలోల పామాయిల్‌ రూ.670 నుంచి రూ.770కి చేరుకుంది. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ 10 కిలోల ధర రూ.750 నుంచి రూ.850 కి చేరుకుంది. వీటి ప్రభావం మిగిలిన నూనెల ధరలపై కూడా పడింది. 10 కిలోల రిఫైన్డ్‌ కాటన్‌ సీడ్‌ ఆయిల్‌ ధర రూ.723 నుంచి రూ.790కు పెరిగింది.

చేతులెత్తేసిన దిగుమతిదారులు
కాకినాడ, కృష్ణపట్నం రేవుల్లో సుమారు 10 మంది దిగుమతిదారులు నూనెల దిగుమతులు నిలిపివేశారు. ఒక్కసారిగా రికార్డు స్థాయిలో నూనెల ధర పెరగడంతో మార్కెట్‌లో నూనె వ్యాపారం స్తంభించిపోయింది. ఈ కారణంగా జిల్లాలోని హోల్‌సేల్‌ నూనె వ్యాపారుల కొనుగోలు చేయడం నిలిపివేశారు. ఈ ప్రభావం ఇప్పటికే ఉన్న స్టాక్‌ పడి ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. కొందరి వ్యాపారుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.

రూ.10 కోట్ల వరకూ భారం
పెరిగిన ఒక్క పామాయిల్, సన్‌ఫ్లవర్‌ ధరలను చూసుకుంటే రాష్ట్రంలోని వినియోగదారులపై రూ.8 కోట్ల భారం పడినట్టు తెలుస్తోంది. రోజుకు రాష్ట్రానికి రెం డు పోర్టుల ద్వారా 90 ట్యాంకుల పామాయిల్‌ దిగుమతి అవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. దీని ప్రకారం నెలకు 2,700 ట్యాంకర్ల ద్వారా నూనె దిగుమతి అవుతోంది. ఒక్కో ట్యాంకరులో వెయ్యి కిలోల నూనె ఉంటుంది. ఒక్కొక్క ట్యాంకరుకు రూ.21వేల ధర పెరుగుతోంది. 90 ట్యాంకర్లకు కలిపితే రూ.18 .90 లక్షల పెరుగుదల ఉండగా, మొత్తంగా రూ.8కో ట్ల పైమాటే. జిల్లా విషయానికి వస్తే రోజుకి 6 టన్ను ల పామాయిల్, సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ విక్రయం అవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈలెక్కన రోజుకు జిల్లా ప్రజలపై రూ.60వేల భారం పడుతుంది.

గతంలో ఎప్పుడూ లేనంత పెరుగుదల
తొలిసారిగా నూనెల ధర ఒక్కసారిగా పెరగడం చూస్తున్నా. ఇంతలా మార్కెట్‌ చరిత్రలోనే నమోదుకాలేదు. ఏకంగా కిలోకు రూ.8 దాటి పెరుగుదల ఉంది. సర్‌చార్జీ, పన్నులు కలుపుకొని కిలోకు రూ.10 పెరిగింది. దిగుమతి సుంకం 12 శాతం నుంచి సుమారు 50 శాతం దాటి పెరిగింది. ఈ ధరల్లో నూనె వ్యాపారం చేస్తే సొమ్ముకు వడ్డీ కూడా దండగలా ఉంది.  – శ్రీనివాసరావు,హోల్‌సేల్‌ నూనెల వ్యాపారి, శ్రీకాకుళం

మరిన్ని వార్తలు