రాజ్యసభ నామినేషన్లకు మద్దతు ఇవ్వొద్దు!: టీడీపీ

10 May, 2016 11:12 IST|Sakshi

పార్లమెంట్ లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రమంత్రులు హెచ్ పీ చౌదరి, జయంత్ సిన్హాలు చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో టీడీపీ నేతలు గత ఆదివారం సమావేశమయ్యారు. బీజేపీ నేతల వ్యాఖ్యలపై అసంతృప్తితో ఉన్ననేతలందరూ రాజ్యసభకు వెంకయ్య, నిర్మలాసీతారామన్ లకు సపోర్ట్ చేయకూడదన్న ధృఢ నిశ్చయాన్ని బాబు వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇప్పటివరకు రాష్ట్రానికి కేంద్ర ఇచ్చిన మాట మేరకు నిధులు సమాకూరలేదని అన్నారు. ప్రత్యేక రైల్వే జోన్ ఊసేలేదు. ప్రత్యేక హోదా ఇవ్వమని తెగేసి చెప్పారు. రెవెన్యూ లోటును భర్తీ చేయలేదు. కొత్త రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు అరకొరగానే ఉన్నాయి. రాష్ట్రానికి ఇంకా చేస్తానన్న పనులు అసలు పట్టాలే ఎక్కలేదని బాబుతో చర్చించినట్లు పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.

ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ నుంచి ఒక్కరికి కూడా ఎగువసభకు అవకాశం ఇవ్వకుండా వేరే రాష్ట్రాలకు చెందిన ఇద్దరిని సభకు పంపడం టీడీపీలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టీడీపీకు రాజ్యసభకు అవకాశం ఇవ్వకపోతే బీజేపీ నామినేట్ చేసిన అభ్యర్థులకు మద్దతు ఉపసంహరించుకోవాలనే యోచనలో సీనియర్ లీడర్లు ఉన్నట్లు సమాచారం. మధ్యప్రదేశ్ నుంచి మాధవ్ డేవ్, చరణ్ మిత్రా, విజయలక్ష్మీ పదవీ కాలం సాథోల మే నెలలో  పూర్తికానుండటంతో వీటిలో ఒక స్థానానికి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడిని రాజ్యసభకు నామినేట్ చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం.

రాజస్థాన్, చత్తీస్ ఘర్ ల నుంచి ఇద్దరు సభ్యుల పదవీకాలం పూర్తికానుండటంతో ఒక స్థానాన్ని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ ను నామినేట్ చేయాలని బీజేపీ వేచిచూస్తోంది. ఏపీ నుంచి కూడా ఇద్దరు మంత్రులను రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయని ఇది కేంద్ర మంత్రుల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని బీజేపీ నేతలు అంటున్నారు.

మరిన్ని వార్తలు