తరతరాలుగా తండాల్లో ఇదే పరిస్థితి

14 Jun, 2019 07:15 IST|Sakshi
దీనంగా చెంచు మహిళలు

జీవశ్చవాలుగా మారుతున్న చెంచులు

బైర్లూటిలో 91 మందికి వితంతు పింఛన్‌

దాదాపుగా అందరి భర్తలూ నాటుసారా వ్యసనంతోనే మృతి 

గూడెం సందర్శనలో విస్తుపోయిన కలెక్టర్‌ 

సాక్షి, ఆత్మకూరు(కర్నూలు): ఆదిమానవుడి ఆనవాలుగా భావించే ఆదిమ గిరిజన చెంచులు ఆంత్రోపాలజీ నేపథ్యంలో అమూల్యమైనవారు. జన్యువైవిధ్య లేమివల్ల వారి సగటు జీవన ప్రమాణమే 45 ఏళ్లు. అయితే వారిలో ఉన్న విపరీతమైన మద్యపాన వ్యసనం కారణంగా అది మరింతగా తగ్గిపో యింది. ఫలితంగా ఏ గూడెం చూసినా ఈ వ్యసనంతో మృతి చెందిన వారే అధికం. తద్వారా పాతికేళ్లు నిండకుండానే వారి భార్యలు వితం తువులుగా మారుతున్నారు. వీరంతా ఆ జాబితాలో పింఛన్‌ కోసం ప్రతి నెలా  గ్రామ సచివాలయాల వద్ద బారులు తీరి కనిపిస్తుంటారు. ఇటీవలే జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న వీర పాండియన్‌ కొత్తగా పంచాయతీగా మారిన బైర్లూటి  చెంచుగూడెం సందర్శన సందర్భంగా  91 మంది(బైర్లూటి, నాగలూటిలో) వితంతు పింఛన్‌ తీసుకుంటున్నట్లు తెలుసుకుని విస్తుపోయారు. 

స్వాతంత్య్రం వచ్చిన తొలిరోజుల్లో కూడా ఒక చెంచు కుటుంబం 5 లీటర్లలోపు నాటుసారా కలిగి ఉండడం ఆమోదయోగ్యమే. అయితే క్రమేపి చెంచులను పునరావాసం పేరిట అడవికి దూరం చేయడం, బైర్లూటి లాంటి ప్రధాన రహదారికి ఆనుకుని ఉండే గూడేల్లో బయటి ప్రపంచ విష సంస్కృతి నేరుగా ప్రవేశించడం వంటి కారణాలతో ఆహారపు అలవాటులో భాగంగా నాటుసారా కాసుకునే చెంచులు.. లిక్కర్‌ వ్యాపారుల దొంగదందాతో తయారయ్యే అత్యంత విషతుల్యమైన  సారా సేవనానికి అలవాటు పడిపోయారు. బెల్లం ఊట, తుమ్మ చెక్కతో మురగబెట్టి నాటు సారా తయారు చేసుకునే చెంచులు అసలు తుమ్మ చెట్టన్నది నల్లమల అటవీ సమీప గ్రామాల్లో విలుప్తమై పోవడంతో యూరియా, పాత ప్లాస్టిక్‌ చెప్పులు, నవాసగ్రం(రసాయనం) వినియోగిస్తున్నారు. ఇలాంటి సారా తాగి జీవశ్చవాలుగా మారి చివరకు చిన్నవయసులోనే మరణిస్తున్నారు.

ప్రాణాంతకంగా చెంచుల ఆహారపు అలవాటు.. 
నాటుసారా సేవనం అనాదిగా చెంచుల ఆహారపు అలవాటులో భాగంగా మారింది. సారా కాసే పద్ధతి వారికి వంశపారంపర్యంగా అలవడింది. ఔషధయుతమైన వన అవశేషాల నుంచి సారా కాసుకునేవారు. తీయని .. మత్తెక్కించే వాసనతో ఉండే విప్పలను సేకరించి సారా తయారు చేసుకునేవారు. తీయదనం కోసం తునికి పండ్లు, చిటిమిటి పండ్ల గుజ్జు వినియోగించేవారు. చెంచులు నాటుసారా కాయడం, తమ వద్ద ఉంచుకోవడాన్ని బ్రిటీష్‌ వారి హయాంలో నేరంగా పరిగణించేవారు కాదు.

గిరిజనుల పాలిట మృత్యుపాశం.. 
అమాయకపు ఆదిమ చెంచు గిరిజనుల పాలిట నాటుసారా.. మృత్యుపాశంగా మారింది. మితిమీరి తాగుతుండడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. క్రమంగా శరీరం శుష్కించి చిన్న వయసులోనే పురుషులు మరణిస్తుంటే వారి భార్యలు అంతకంటే చిన్న వయసులో వితంతువులుగా మారుతున్నారు. ఫలితంగా గూడేల్లో ఎక్కడ చూసినా ఇలాంటి వారే కనిపిస్తుండడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. చెంచుల మనుగడకే ఆటంకంగా మారిన నాటుసారా తయారీ, రవాణాను అరికట్టడంలో దశాబ్దాలుగా ప్రభుత్వ శాఖల సమష్టి కృషి కనిపించడంలేదు. 

14 ఏళ్లకే పెళ్లి.. 17 ఏళ్లకే వైదవ్యం.. 
సాంస్కృతిక వెనుకబాటు కారణంగా చెంచులు తమ పిల్లలకు అతిపిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు. 13 ఏళ్లు నిండక ముందే చెంచు బాలికలకు వివాహ యత్నాలు మొదలవుతాయి. 14 ఏళ్లకే పెళ్లిళ్లవుతాయి. 16ఏళ్లలోపే గర్భవతులయ్యే చెంచు బాలికలు రక్తహీనత కారణంగా ప్రసవంలో మరణాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రసవాల్లో చచ్చి బతికే చెంచు బాలికలకు విపరీతమైన మద్యపాన వ్యసనపరులైన భర్తల అనారోగ్యం పెద్ద సమస్యగా మారుతోంది. తీవ్ర మద్యపాన సేవనంతో పెళ్లయిన నాలుగేళ్లకే మరణించే చెంచులు ఎందరో ఉన్నారు. ఈ కారణంగా కనీసం ఇరవై ఏళ్లు నిండకుండానే వారి భార్యలు వైదవ్యానికి గురవుతున్నారు.  

గూడెంలో మా బతుకులు మారాలి.. 
సారాయి తాగితాగి గూడెంలో చిన్న వయసులో మొగోళ్లు సచ్చి పోతున్నారు. వాళ్ల పెండ్లాలు ఇరవై ఏళ్లు నిండకుండానే విధవలై చంటిపిల్లలతో నానాయాతన పడుతున్నారు. గూడెంలో సారా కాయొద్దని ఎంత సెప్పినా వినడం లేదు. గూడేల నుంచి సారా పోయినప్పుడే మా బతుకులు మారేది.  
 –  గొలుసమ్మ, గూడెం పెద్ద, బైర్లూటి  

ఆరో తరగతిలోనే పెళ్లయింది.. 
మా పెద్దలు ఆరోతరగతిలోనే బడి మాన్పించి పెళ్లి సేసినారు. పెళ్లయిన నాలుగేళ్లకే నా మొగుడు నాగన్న సారాయి తాగితాగి అనారోగ్యంతో సచ్చిపోయినాడు. ఒక బిడ్డతో బతుకు నెట్టుకొస్తున్నాను. మా గూడెంలో ఎక్కడ చూసినా నాలాంటోళ్లే ఉన్నారు.
 – అర్తి నాగమ్మ, వితంతు పింఛన్‌దారు, బైర్లూటి 

కౌన్సెలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు.. 
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆరోగ్య ఉప కేంద్రాన్ని హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రంగా మార్చబోతోంది. ఈ కేంద్రాల్లో డీ –అడిక్షన్‌ సెంటర్లు కూడా ఉంటాయి. చెంచులను సారా మాన్పించేందుకు ఈ కేంద్రాలు కృషి చేస్తాయి.
 – డాక్టర్‌ సి.గోపాల్‌ ,బైర్లూటి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘చంద్రయాన్-2’ కౌంట్ డౌన్ షురూ

ఈనాటి ముఖ్యాంశాలు

ఏపీకి సాయంపై వరల్డ్‌ బ్యాంక్‌ స్పష్టత

విద్యార్థులకు పురస్కారాలు అందజేసిన మంత్రి అనిల్‌

‘గోదావరి జిల్లా వాసుల కల నిజం చేస్తా’

‘అన్యాయం జరిగితే నన్ను కలవండి’

నిండు గర్బిణిని డోలీలో తీసుకెళ్లారు!

నీటి కేటాయింపులకు చట్టబద్దత కల్పించాలి

‘అర్చకులు బాగుంటేనే ఆలయాలు బాగుంటాయి’

అవినీతి అంతా బయటకు తీస్తాం: చీఫ్‌ విప్‌

సెంట్రల్‌ జైలులో మృత్యుఘోష

సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తా..

అది చిరుత కాదు హైనానే

ఈ త్రివేణి 'నాట్యం'లో మేటి

సదా ప్రజల సేవకుడినే

నిబంధనలు తూచ్‌ అంటున్న పోలీసులు

తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు: వైఎస్‌ జగన్‌

నారాయణ కళాశాల నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం

‘చంద్రబాబు కోటరీలో వణుకు మొదలైంది’

పన్నులు కట్టండి.. కర్తవ్యాన్ని పాటించండి

పులివెందులలో ప్రగతి పరుగు

సమగ్రాభివృద్ధే విజన్‌

వడ్డీ జలగలు..!

కత్తులు, రాడ్లతో స్వైర విహారం

గుట్టుగా గుట్కా దందా

చరిత్ర సృష్టించిన ప్రకాశం పోలీస్‌

ఇక గ్రామ పంచాయతీల వ్యవస్థ 

సచివాలయం కొలువులకు 22న నోటిఫికేషన్‌

బల్లికి 3,000.. ఎలుకకు 10,000

అతివలకు అండగా..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మొదటిరోజే హౌస్‌మేట్స్‌కు షాక్‌!

వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది