పల్లెల్లోనూ ఈతకొలనులు

17 Feb, 2014 01:20 IST|Sakshi
పల్లెల్లోనూ ఈతకొలనులు

పల్లెల్లోనూ
 ఈతకొలనులు
 పరిగి,  ఇప్పటి వరకూ పట్టణాలకే పరిమితమైన స్విమ్మింగ్‌పూల్ కల్చర్ క్రమంగా గ్రామాలకూ విస్తరిస్తోంది. పదేళ్ల క్రితం వరకూ ఏ ఊరిలో చూసినా వాగులు, చెరువులు, కుంటలు, బావుల్లో పుష్కలంగా నీళ్లుండేవి. ఒక్కో గ్రామంలో 50 నుంచి 100 వ్యవసాయ బావులు ఉండేవి. వేసవి సీజన్‌లోనూ నీళ్లు కనిపించేవి. వేసవి వచ్చిందంటే చిన్నాపెద్దా తేడా లేకుండా ఈత కొడుతూ ఉల్లాసంగా గడిపేవారు. ప్రస్తుతం చెరువులు, కుంటలు ఎండిపోవడం, బావుల స్థానంలో బోరుబావులు రావటంతో ఈత కొట్టేందుకు అవకాశమే ఉండడం లేదు. ఈ నేపథ్యంలో నగరాల్లోనే కనిపించే స్విమ్మింగ్‌పూల్స్ సంస్కృతి పల్లెటూళ్లకూ పాకింది. ఇప్పటికే పూడూరు మండల పరిధిలోని చాలా ఫాంహౌస్‌లలో ఆటవిడుపు కోసం స్విమ్మింగ్‌పూల్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల పరిగి పరిధిలో ఓ స్విమ్మింగ్‌పూల్‌ను నిర్మించారు. దీంతో ఫీజుకు వెరవకుండా పిల్లలు, యువకులు అని తేడా లేకుండా స్విమ్మింగ్‌పూల్‌లో సరదాగా గడుపుతున్నారు.     
 
 

>
మరిన్ని వార్తలు