ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడో..?

15 Mar, 2017 17:39 IST|Sakshi
ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడో..?

► గోరింట–మల్లాం రహదారికి తూట్లు
► పట్టించుకోని పాలకులు.. ఇక్కట్లు ఎదుదర్కొంటున్న ప్రజలు

గోరింట(పెద్దాపురం): ఏళ్ళ తరబడి రెండు సెగ్మెంట్‌లను కలిపే రోడ్డుకు తూట్లు పడ్డాయి. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటేనే ప్రజలు నానావస్థలు పడుతున్నారు. పెద్దాపురం, పిఠాపురం సెగ్మెంట్లను కలుపుతూ ఏర్పడ్డ ఈ రోడ్డుపై గోరింట, మల్లాం గ్రామాల ప్రజలతో పాటు సుదూర ప్రాంతాల ప్రజలు ప్రయాణం చేస్తుంటారు. కానీ పాలకులు మాత్రం ఈ రోడ్డు మరమ్మతులకు గురైనా పట్టించుకోవడం లేదు.  గోరింట గ్రామానికి చెందిన హైస్కూల్‌ విద్యార్థులు పిఠాపురం మండలం మల్లాంలోనే విద్యనభ్యశిస్తారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్ళాలంటే నరక యాతన అనుభవిస్తున్నారు.

పెద్ద పెద్ద గోతుల కారణంగా చాలా ప్రమాదాలు సంభవిన్నాయి. ఇక వర్షా కాలం వస్తే ఈ రెండు గ్రామాల ప్రజల అవస్థలు వర్ణాణాతీతం. గోతుల్లో నీరు చేరడంతో వాహన చోదకులు గోతుల్లో పడి ప్రమాదాల బారిన పడిన సంఘటనలు అనేకం. అయినా సంబంధిత శాఖ అధికారులు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరించడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటు మంత్రి నియోజకవర్గం, అటు ఓ ప్రముఖ శాసనసభ్యుడికి చెందిన సెగ్మెంట్‌ పరిధిలో ఉన్న ఈ రోడ్డు నిర్మాణానికి మోక్షం కల్గించి ప్రజల ఇబ్బందులను తొలగించాలని పలువురు కోరుతున్నారు.

పాఠశాలకు వెళ్ళాలంటే భయమేస్తుంది: తుమ్మల భవ్యశ్రీ, విద్యార్ధిని, గోరింట
మల్లాం పాఠశాలకు వెళ్ళాలంటే  భయం వేస్తుంది. రోడ్డు గోతులు కారణంగా సైకిల్‌పై నుంచి గోతిలో పడిన సంఘటనలు ఇప్పటికీ భయపెడుతూనే ఉన్నాయి.

పాలకులు స్పందించి రోడ్డు నిర్మించాలి: చల్లా శ్రీనివాస్, ఎస్‌ఎంసి చైర్మన్, మల్లాం
రెండు నియోజకవర్గాలను కలుపుతూ ఉన్న లింకు రోడ్డు నిర్మాణంపై పాలకులు స్పందించాలి. విద్యార్థులు, ప్రయాణీకుల అవస్థలను దష్టిలో ఉంచుకుని సత్వరమే రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

మంత్రి దృష్టి సారించాలి: కోన లోవరాజు, గోరింట
మంత్రివర్యూలు రోడ్డు నిర్మాణంపై దష్టి సారించి ప్రజలు అవసరాలను తీర్చాల్సిన అవసరం ఉంది. రెండు గ్రామాల ప్రజలు, ప్రయాణీకుల ఇబ్బందులను తీర్చాల్సిన బాధ్యతపై దష్టి సారించి ప్రజల కష్టాలు తీర్చాలని కోరుతున్నాం.
 

మరిన్ని వార్తలు