రోడ్డు వేస్తారా..చావమంటారా..!

24 Nov, 2013 04:20 IST|Sakshi

గూడూరు టౌన్, న్యూస్‌లైన్ : వీధి మొత్తం సిమెంట్ రోడ్డు వేస్తారా..లేదంటే కిరసనాయిల్ పోసుకుని చా వమంటారా.. అని బెదిరిస్తూ గూ డూరులో ఓ మహిళ అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. మాళవ్యానగర్‌లోని వివేకానంద స్కూ లుకు వెళ్లే మార్గంలో సిమెంట్ రో డ్డు నిర్మాణానికి రూ.3 లక్షలు మం జూరైంది.

 

శనివారం ఆ వీధిలో రో డ్డు పనులను అధికారులు ప్రారంభించారు. వీధి మొదటి నుంచి కా కుండా, మధ్యలో నుంచి రోడ్డు వే స్తుండటంపై స్థానికులు సౌజన్య మ్మ, జయరామిరెడ్డి అభ్యంతరం తెలిపారు. నిధులు వచ్చిన మేరకే రోడ్డు వేస్తున్నామని అధికారులు స ర్దిచెప్పబోయారు. ఆగ్రహంతో ఊ గిపోయిన సౌజన్యమ్మ ఒంటిపై కి రోసిన్ పోసుకుని రోడ్డుపై బైఠాయించారు. వీధిలో మొత్తం సిమెం ట్‌రోడ్డు వేయాల్సిందేనని పట్టుబ ట్టారు. మున్సిపల్ కమిషనర్ సుశీ లమ్మ వివేకానంద స్కూలు వీధికి చేరుకున్నారు. సౌజన్యమ్మకు సర్దిచెప్పేం దుకు ప్రయత్నించినా ఫలి తం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రం గంలోకి దిగి సౌజన్యమ్మను అక్కడ నుంచి పంపించేశారు.
 

>
మరిన్ని వార్తలు