నవరత్నాలతో ప్రతి కుటుంబానికీ మేలు

26 Nov, 2018 16:53 IST|Sakshi
పుచ్చల్లంకలో రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఉభయ గోదావరి జిల్లాల రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి

ఉభయ గోదావరి జిల్లాల వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి

పుచ్చల్లంకలో మహానేత వైఎస్సార్‌ విగ్రహం ఆవిష్కరణ

తూర్పుగోదావరి, పి.గన్నవరం: వైఎస్సార్‌ సీపీ అధినేత  జగన్‌మోహనరెడ్డి ప్రకటించిన నవరత్న పథకాలతో రాష్ట్ర ప్రజానీకానికి ఎంతో మేలు జరుగుతుందని ఆ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజినల్‌ కోఆర్డినేటర్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కంటె మెరుగైన పాలన అందించే సత్తా ఉన్న జగన్‌ను వచ్చే ఎన్నికల్లో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. మొండెపులంక సరిహద్దు గ్రామమైన పశ్చిమ గోదావరి జిల్లా అయోధ్యలంక శివారు పుచ్చల్లంక గ్రామంలో ఆచంట నియోజకవర్గ  కో ఆర్డినేటర్‌ చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివంగత సీఎం రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని సుబ్బారెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కో ఆర్డినేటర్‌ శ్రీరంగనాథరాజు దత్తత గ్రామమైన అయోధ్యలంకలో రూ.10 లక్షల వ్యయంతో ఆయన నిర్మించిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను సుబ్బారెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా పుచ్చల్లంకలో జరిగిన సభలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే లంక గ్రామాల ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామన్నారు. అయోధ్యలంక గ్రామం నుంచి పుచ్చల్లంకకు శ్రీరంగనాథరాజు తాగునీరు సరఫరా చేస్తారన్నారు. అర్హులకు పెన్షన్లు రాకపోతే.. వారికి శ్రీరంగనాథరాజు స్వయంగా పెన్షన్లు ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీరంగనాథరాజును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సుబ్బారెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం జరిగిన కార్తిక వన సమారాధనలో సుబ్బారెడ్డి పాల్గొన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి,  అమలాపురం, రాజ మహేంద్రవరం, నరసాపురం పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, కవురు శ్రీనివాస్, గూడూరి ఉమాబాల, నాయకులు చెల్లెం ఆనంద ప్రకాష్, కడలి గోవిందు, మంతెన యోగీంద్రవర్మ, సుంకర సీతారామ్, మడిమెట్ల రాంబాబు, అడ్డగళ్ల వెంకటసాయిరామ్, కర్రి నాగిరెడ్డి, యన్నాబత్తుల ఆనంద్, ముప్పిడి వెంకటేశ్వరరావు, కొప్పాడి సత్యనారాయణ, గొల్లపల్లి బాలకృష్ణ, కొండేటి వెంకటేశ్వరరావు, బొక్కా అరుణ, వైట్ల కిశోర్, మామిడిశెట్టి కృష్ణవేణి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు