హాస్టల్‌లో వైఎస్సార్‌సీపీ నేతల ఆకస్మిక తనిఖీ

28 Jan, 2017 12:38 IST|Sakshi
హాస్టల్‌లో వైఎస్సార్‌సీపీ నేతల ఆకస్మిక తనిఖీ

గుంటూరు : గుంటూరు జిల్లాలో ఎస్టీ హాస్టల్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలను నేతలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

అధ్వాన్న పారిశుద్ధ్యం, నాసిరకం భోజనం పెడుతున్నారంటూ విద్యార్థులు నేతల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టళ్లలో ప్రభుత్వం మౌలికవసతులు కల్పించకపోవడంపై నేతలు మండిపడ్డారు. విద్యార్థుల సమస్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. హాస్టల్‌ను తనిఖీ చేసిన వారిలో ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి, చైతన్య, జిల్లా నేతలు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు