ఎయిర్ కోస్టా ప్రత్యేక ఆఫర్లు

23 Mar, 2014 00:40 IST|Sakshi

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేసవి సీజన్‌ను పురస్కరించుకుని రాష్ట్రానికి చెందిన విమానయాన సంస్థ ఎయిర్‌కోస్టా ఈ నెల 23  (నేటి) నుంచి 25వ తేదీ దాకా టికెట్లపై ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది.


మార్చ్ 30 నుంచి మే 31లోగా చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్లు వర్తిస్తాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, వైజాగ్ రూట్లలో టికెట్లను రూ. 2,499, జైపూర్, చెన్నై, హైదరాబాద్ తదితర రూట్లలో రూ. 4,999.. అహ్మదాబాద్, చెన్నై, బెంగళూరు సెక్టార్‌లో రూ. 3,999కే టికెట్లు అందిస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.


కొత్తగా వైజాగ్‌కి కూడా సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు ఎయిర్ కోస్టా ఎండీ ఎల్‌వీఎస్ రాజశేఖర్ పేర్కొన్నారు. త్వరలోనే కోయంబత్తూర్, మదురైకి సేవలు విస్తరించనున్నారు.
 
 

మరిన్ని వార్తలు