అంబానీ మరో కీలక నిర్ణయం : షేర్లు ఢమాల్‌

1 Jul, 2019 15:28 IST|Sakshi

విక్రయానికి రిలయన్స్‌  గ్రూపు హెడ్‌ క్వార్టర్స్‌

వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలోని శాంటాక్రూజ్ భవన సముదాయం విక్రయం? లేదా లీజ్‌

తద్వారా   సమకూరే వేలకోట్లతో అప్పులు తీర్చాలని ప్లాన్‌

సాక్షి,ముంబై: అప్పుల ఊబిలో చిక్కుకున్న  రిలయన్స్‌ గ్రూపు ఛైర్మన్‌ అనిల్‌ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టుతెలుస్తోంది.   ముంబైలోని  అతి విలాసవంతమైన భవన సముదాయాన్ని  విక్రయించడమో లేదా  అద్దెకివ్వడమో చేయాలని యోచిస్తున్నారట. తద్వారా  కొన్ని అప్పులు తీర్చాలని భావిస్తున్నారు. 

ముంబైలోని వెస్ట్రన్ ఎక్స్‌ప్రెస్ హైవేలో 7లక్షల  చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన శాంటాక్రూజ్ ప్రధాన కార్యాలయాన్ని విక్రయించడానికి లేదా దీర్ఘకాలిక లీజ్‌కివ్వడానికి యోచిస్తున్నారు  అనిల్‌ అంబానీ. ఈ మేరకు గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థల గ్రూపు సంస్థ బ్లాక్‌స్టోన్ , యుఎస్ ఆధారిత ఫండ్‌తో చర్చలు జరుపుతున్నట్టు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.  తద్వారా 1,500-2,000 కోట్ల రూపాయల  సమకూర్చకోనుందని ఎకనామిక్ టైమ్స్‌ ఒక  కథనంలో పేర్కొంది. మరోవైపు  ఈ భవనం కూడా చట్టపరమైన  వివాదాల్లో చిక్కుకున్న నేపథ్యంలో  ఈ లావాదేవీకోసం  ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జెఎల్‌ఎల్‌ను కూడా నియమించుకుంది. అంతేకాదు ప్రస్తుతం ఖాళీగా ఉన్న దక్షిణ ముంబైలోని తన బల్లార్డ్ ఎస్టేట్ కార్యాలయానికి తిరిగి వెళ్లాలని కూడా అంబానీ ఆలోచిస్తున్నారని సమాచారం. ఈ వార్తల  నేపథ్యంలో అడాగ్‌ గ్రూపు షేర్లు భారీగా నష్టపోతున్నాయి.

కాగా 2008లో 42 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 6వ ధనవంతుడైన అనిల్ అంబానీ కూడా గత నెలలో బిలియనీర్ క్లబ్ నుంచి కిందికి జారుకున్నారు.  మార్చి 2018 నాటికి  రిలయన్స్ గ్రూప్ కంపెనీల మొత్తం రుణం రూ.1.7 లక్షల కోట్లకు పైగా ఉంది. 11 సంవత్సరాలలో, అంబానీ  మొత్తం వ్యాపార సామ్రాజ్యం  ఈక్విటీ విలువ 3,651 కోట్ల రూపాయలకు (23 523 మిలియన్లు) కుప్పకూలింది. 2005 లో  రిలయన్స్ సామ్రాజ్యాన్ని అన్నదమ్ములు (అన్న ముకేశ్‌ అంబానీ) తమలో తాము విభజించుకోవాలని నిర్ణయించుకున్న తరువాత అనిల్‌ అంబానీకి ఈ కార్యాలయం లభించింది.

మరిన్ని వార్తలు