నీరవ్‌ మోదీకి త్వరలోనే అరెస్ట్‌ వారెంట్‌ ?

11 Mar, 2019 19:19 IST|Sakshi

అడిషనల్‌ చార్జిషీట్‌ దాఖలు

చార్జిషీట్‌లో నీరవ్‌ భార్య అమి మోదీ పేరు

లండన్‌కు సీబీఐ, ఈడీ అధికారుల ప్రత్యక బృందం

సాక్షి,ముంబై:   పీఎన్‌బీ కుంభకోణంలో కీలక నిందితుడు, ఆర్థిక నేరగాడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ మీద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌(ఈడీ) తాజా ఛార్జ్‌షీట్‌ను దాఖలుచేసింది. లండన్‌లో  స్వేచ్ఛగా చక్కర్లు కొడుతున్న మోదీ వీడియో రేపిన సంచలనం నేపథ‍్యంలో ఈడీ మరో చార్జి షీటును దాఖలు చేసింది. మనీ లాండరింగ్‌ చట్టం కింద అనుబంధ చార్జిషీట్‌గా నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు. 

ప్రధానంగా నీరవ్‌ భార్య అమి మోదీను ఇందులో చేర్చారు. ప్రత్యేక న్యాయస్థానంలో సోమవారం దీన్ని దాఖలు చేసింది.  దాంతోపాటు అదనపు ఆధారాలను కూడా సమర్పించినట్లు అధికారులు ఈడీ అధికారులు వెల్లడించారు. అంతేకాదు సీబీఐ, ఈడీ అధికారులతో  కూడిన ప్రత్యేక బృందం త్వరలోనే లండన్‌ బయలు దేరనుందని తెలుస్తోంది. అలాగే మోదీని దేశానికి తిరిగి రప్పించడానికి సంబందించిన నోటిషికేషన్‌ను వెస్ట్‌మినిస్టర్‌  మాజిస్ట్రేట్‌ కోర్టుకు  పంపినట్టు  బ్రిటన్‌ హోం శాఖ అధికారులు ధృవీకరించారు. దీని పరిశీలన అనతరం అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసే అవకాశం ఉందని తెలిపారు.

కాగా పంజాబ్‌ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)కు సుమవారు 14వేల కోట్ల రూపాయలు మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్‌ మోదీ  లండన్‌కు పారిపోయాడు. లండన్‌ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతూ,  విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న మోదీ అక్కడ వజ్రాల వ్యాపారం కూడా చేస్తున్నట్లు రెండు రోజుల క్రితం బ్రిటిష్‌ మీడియా విడుదల చేసిన వీడియో ద్వారా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు