కోవిడ్‌-19 భయాలతో భగ్గుమన్న బంగారం

6 Apr, 2020 20:15 IST|Sakshi

ముంబై : బంగారం రేసుగుర్రంలా పరుగెడుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తితో స్టాక్‌మార్కెట్లు కుదేలవుతుంటే బంగారం మళ్లీ భారమైంది. షేర్‌ మార్కెట్‌ నుంచి వైదొలగుతున్న మదుపుదారులు సురక్షిత సాధనంగా బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపుతుండటం హాట్‌ మెటల్స్‌కు డిమాండ్‌ పెంచుతోంది. ఎంసీఎక్స్‌లో సోమవారం పదిగ్రాముల బంగారం రూ 480 భారమై రూ 43,720కు ఎగబాకింది. కిలో వెండి రూ 1439 పెరిగి రూ 41,311కి చేరింది. సంక్షోభ సమయంలో కరెన్సీలు, షేర్ల కంటే బంగారంలో మదుపు చేయడం మెరుగైన రాబడి అందిస్తుందని ఇన్వెస్టర్లు పసిడిని ఎంచుకుంటున్నారు.

మరిన్ని వార్తలు