దీదీలా మీకు అనిపిస్తోందా..?

26 Oct, 2017 12:49 IST|Sakshi

తన మొబైల్‌ నెంబర్‌ను ఆధార్‌తో లింకు చేసుకోనని, కావాలంటే తన ఫోన్‌ను డిస్‌కనెక్ట్‌ చేసుకోవచ్చని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మమతా బెనర్జీలాగానే మీకు అనిపిస్తోందా? మీ మొబైల్‌ నెంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడంపై అసంతృప్తితో ఉన్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌. దీనిపై ప్రభుత్వం ప్రత్యామ్నాయ అవకాశాలను అన్వేషిస్తుందని టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా రిపోర్టు చేసింది. రేషన్‌ కార్డు లేదా డ్రైవర్స్‌ లైసెన్సును మొబైల్‌ కనెక్షన్లను ధృవీకరించడం కోసం వాడుకోవచ్చని అధికారిక వర్గాలు పేర్కొన్నట్టు ఈ న్యూస్‌పేపర్‌ పేర్కొంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఆధార్‌-మొబైల్‌ లింకింగ్‌కు వ్యతిరేకంగా నమోదైన ఫిర్యాదులపై ప్రస్తుతం సుప్రీంకోర్టు స్పందించాల్సి ఉంది.

ఫిబ్రవరి 6న అయితే 100 కోట్లకు పైగా ఉన్న టెలిఫోన్‌ కస్టమర్లందరి దగ్గర్నుంచి తమ గుర్తింపు వివరాలు తీసుకోవాలని టెలికాం కంపెనీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో ఆధార్‌తో మొబైల్‌ నెంబర్‌ను లింక్‌ చేసుకోవాలని, లేదంటే తమ నెంబర్‌ను డీయాక్టివేట్‌ చేస్తామంటూ కంపెనీ మెసేజ్‌లు కూడా పంపుతున్నాయి. దీని కోసం 2018 ఫిబ్రవరి 6ను డెడ్‌లైన్‌గా విధించాయి. అయితే ఆధార్‌ను మొబైల్‌తో లింక్‌ చేసుకోవడం ప్రైవసీకి విరుద్దమని పశ్చిమ బెంగాల్‌ సీఎం తెలిపారు. అంతేకాక ప్రైవసీ ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు కూడా తెలిపింది. 

మరిన్ని వార్తలు