పీఎన్‌బీ కేసులో మాజీ ఎండీకి షాక్

14 Aug, 2018 01:44 IST|Sakshi

సీబీఐ విచారణకు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్‌బీ) కుంభకోణంలో ఆ బ్యాంకు మాజీ ఎండీ ఉషా అనంత సుబ్రమణియన్‌ను కేంద్ర ప్రభుత్వం డిస్మిస్‌ చేసింది. ఈ మేరకు సోమవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం అలహాబాద్‌ బ్యాంకు ఎండీ, సీఈఓగా ఉన్న ఉషా పదవీ కాలం సోమవారంతో ముగియగా అదేరోజున కేంద్రం ఈ ఉత్తర్వులు వెలువరించటం గమనార్హం. ఉషాతో పాటు పీఎన్‌బీ మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంజీవ్‌ శరణ్‌ను విచారించేందుకు సీబీఐకి అనుమతిని కూడా కేంద్రం మంజూరు చేసింది.

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును వజ్రాభరణాల వ్యాపారవేత్త నీరవ్‌ మోదీ దాదాపు రూ. 14,000 కోట్ల మేర మోసం చేసిన కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉషా అనంతసుబ్రమణియన్‌ గతంలో రెండు దఫాలుగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు సారథ్యం వహించారు. 2011 జూలై నుంచి 2013 నవంబర్‌ దాకా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గాను, 2015 ఆగస్టు నుంచి 2017 మే దాకా ఎండీ, సీఈవోగా వ్యవహరించారు.

నీరవ్‌ మోదీ స్కామ్‌ ప్రారంభమైనది కూడా దాదాపు ఆ సమయంలోనే. కొన్నాళ్లుగా ఉషా అనంతసుబ్రమణియన్‌ అలహాబాద్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే స్కామ్‌ దరిమిలా ఆమె అధికారాలకు బ్యాంకు కత్తెర వేసింది. సీబీఐ చార్జిషీటులో ఉషాతో పాటు ఇద్దరు మాజీ ఈడీలైన బ్రహ్మాజీ రావు, సంజీవ్‌ శరణ్‌ పేర్లు  ఉన్నాయి. ఆమెతో పాటు ఇతర సీనియర్‌ బ్యాంక్‌ అధికారులకు అక్రమ లావాదేవీల గురించి తెలిసినప్పటికీ.. వారు దిద్దుబాటు చర్యలేమీ తీసుకోలేదని అభియోగాలున్నాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కొనుగోళ్ల జోష్‌: మార్కెట్ల రీబౌండ్‌

అద్భుత ఫీచర్లతో జియో ఫోన్‌-3 వస్తోంది!

మాల్యా పిటిషన్‌పై విచారణ వాయిదా

అమ్మకాల జోరు - 300 పాయింట్లు పతనం

నష్టాలతో ప్రారంభమైన రూపాయి

సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ శ్రావణ సంబరాలు

తగ్గిన ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు

స్టాక్‌మార్కెట్లు : నేటి ట్రెండ్‌

భారత్‌లో డిమాండ్‌ బంగారం

మ్యాక్స్‌క్యూర్‌.. ఇక మెడికవర్‌ హాస్పిటల్స్‌!!

ఎయిర్‌టెల్‌ నష్టాలు 2,856 కోట్లు

దివాలా బిల్లుకు లోక్‌సభ ఆమోదం

‘బేర్‌’ బాజా!

కాఫీ డే అప్పులు రూ. 5,200 కోట్లు!!

ఫుడ్‌ లవర్స్‌కు జియో బంపర్‌ ఆఫర్‌

14 ఏళ్లలో మొదటిసారి : ఎయిర్‌టెల్‌కు షాక్‌

హువావే వై 9 ప్రైమ్‌ లాంచ్‌

రూపాయి కోలుకున్నా..బలహీనమే

ఫెడ్‌ షాక్‌: భారీ నష్టాలు

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లకు ఈడీ షాక్‌

చిదంబరానికి మధ్యంతర ఊరట

సగానికి తగ్గిన అశోక్‌ లేలాండ్‌ లాభం

లెనొవొ ‘యోగా ఎస్‌940’

ఐఓసీ లాభం 47 శాతం డౌన్‌

ఐషర్‌ మోటార్స్‌ లాభం 22% డౌన్‌

ఆఫిల్‌ ఇండియా ఐపీఓ... అదుర్స్‌ !

నెమ్మదించిన ఎనిమిది కీలక రంగాలు

కార్పొరేట్‌ భారతంలో భారీ కుదుపు

నగరంలో దారికిరాని జ్యువెలరీస్‌.. క్యా'రేట్‌' మోసం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘గుణ 369‌‌’ మూవీ రివ్యూ

‘రాక్షసుడు’ మూవీ రివ్యూ

కాజల్‌ వద్దనుకుందా?

2019 అబ్బాయి.. 1993 అమ్మాయి!

సైబర్‌ క్రైమ్‌ గురించి చెప్పాం

లాక్‌ చేశారు