నాల్గవ త్రైమాసికంలో వృద్ధి 7.4 శాతం: ఇక్రా

22 May, 2018 01:05 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2017–18 నాల్గవ త్రైమాసికంలో (జనవరి–మార్చి) 7.4 శాతంగా ఉంటుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనావేసింది. మూడవ త్రైమాసికంలో 7.2 శాతంగా జీడీపీ వృద్ధి రేటు నమోదయ్యింది. రబీ పంట దిగుబడులు, కార్పొరేట్‌ ఆదాయాలు పెరిగే అవకాశాలు క్యూ4 ఫలితం మెరుగుదలకు కారణంగా పేర్కొంది.

మే 31వ తేదీన నాల్గవ త్రైమాసికం జీడీపీ గణాంకాలతో  పాటు 2017–18 ఆర్థిక సంవత్సరం జీడీపీ తొలి అంచనాలను అధికారికంగా కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) విడుదల చేయనుంది. 

>
మరిన్ని వార్తలు