గుడ్‌న్యూస్‌ : జీఎస్టీ రేట్లు తగ్గాయి

21 Jul, 2018 20:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అధిక పన్ను రేట్లతో సతమవుతున్న సామాన్యులకు జీఎస్టీ మండలి తాజాగా చేసిన ప్రకటన ఉపశమనాన్ని కలిగించింది. ప్రజల అవసరాలు, డిమాండ్ల దృష్ట్యా జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి పలు ఉత్పత్తులు, సర్వీసులపై కేంద్రం పన్ను రేట్లు తగ్గిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరికొన్ని వస్తువులపై కూడా జీఎస్టీ రేట్లను తగ్గిస్తున్నట్లు జీఎస్టీ మండలి ప్రకటించింది. శనివారం జరిగిన 28వ జీఎస్టీ మండలి సమావేశంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్ తెలిపారు. మహిళల ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా శానిటరీ నాప్‌కిన్స్‌పై జీఎస్టీ నుంచి మినహాయింపు  ఇచ్చినట్టు పేర్కొన్నారు. బలవర్ధకమైన పాలు, విస్తరాకులపై జీఎస్టీ రద్దు చేస్తున్నట్లు తెలిపారు. కాగా కొత్తగా ప్రకటించిన తగ్గింపు రేట్లు జూలై 27 నుంచి అమలులోకి రానున్నాయి.

జీఎస్టీ నుంచి మినహాయింపు పొందిన వస్తువులు
*శానిటరీ నాప్‌కిన్స్‌
*చీపుర్లలో ఉపయోగించే ముడి సరుకులు
*మార్బుల్స్‌, రాఖీలు, పాలరాయి
*రాళ్లు, చెక్కతో చేసిన విగ్రహాలు
*ఆర్బీఐ జారీ చేసే స్మారక నాణేలు

పన్ను శాతం తగ్గిన వస్తువులు..
*వెయ్యి రూపాయల లోపు పాదరక్షలపై 5 శాతం
*హ్యాండ్లూమ్‌ దారాలపై 12 నుంచి 5 శాతానికి తగ్గింపు
*లిథియం అయాన్‌ బ్యాటరీలు, వ్యాక్యూమ్‌ క్లీనర్లు, గ్రైండర్లు, ఇస్త్రీ పెట్టెలు, వాటర్‌ హీటర్లు, వాటర్‌ కూలర్లు, పర్‌ఫ్యూమ్స్‌, టాయ్‌లెట్‌ స్ప్రేలు, ఫ్రిజ్‌లు, హేర్‌ డ్రయర్స్‌, వార్నిష్‌లు, కాస్మోటిక్స్‌, పెయింట్లలపై 28 నుంచి 18 శాతానికి తగ్గింపు

మరిన్ని వార్తలు