పన్ను మినహాయింపునకు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు!

30 Oct, 2018 00:42 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను మినహాయింపు కోరుతూ విద్యా సంస్థలు, ఆసుపత్రులు, దాతృత్వ, మతపరమైన ట్రస్టులు ఇకపై  ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకునే వీలు కల్పించే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించి తమ అభిప్రాయాలను సెప్టెంబర్‌ 12వ తేదీ నాటకి తెలియజేయాలని ఆయా వర్గాలను ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) కోరింది. నిబంధనలు సవరించడం, దరఖాస్తు విధానంలో మార్పులు దీని ప్రధాన లక్ష్యం.

‘‘డిజిటల్‌ విధానాలు పురోగతి చెందాయి. దీనితో పన్ను మినహాయింపునకు సంబంధించి మ్యాన్యువల్‌ ఫైలింగ్‌ విధానాన్ని ఆధునికీకరించాలన్నది ఐటీ శాఖ లక్ష్యం. ఆన్‌లైన్‌లో ఈ  పక్రియ ప్రారంభం వల్ల ప్రాసెసింగ్‌  వేగంతో పాటు, ఆదాయపు పన్ను శాఖ– దరఖాస్తుదారు మధ్య అనవసర ప్రత్యక్ష సంప్రదింపుల సమస్యా తొలిగిపోతుంది’’ అని ప్రత్యక్ష పన్నుల సెంట్రల్‌ బోర్డ్‌ (సీబీడీటీ) ఒక ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తలు