ఆల్ టైం గరిష్టానికి ఫారెక్స్ నిల్వలు

26 Mar, 2016 00:58 IST|Sakshi
ఆల్ టైం గరిష్టానికి ఫారెక్స్ నిల్వలు

ముంబై: దేశంలో విదేశీ మారక నిల్వలు ఆల్‌టైం గరిష్ట స్థాయికి పెరిగాయి. ఈ నెల 18తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 2.53 బిలియన్ డాలర్లమేర పెరిగి 355.94 బిలియన్ డాలర్లకు ఎగశాయి. విదేశీ కరెన్సీ ఎసెట్స్ (ఎఫ్‌సీఏ) పెరుగుదల ఫారెక్స్ నిల్వల వృద్ధే ప్రధాన కారణమని ఆర్‌బీఐ తెలిపింది. ఈ నెల 18తో ముగిసిన వారపు కడపటి వారంలో ఫారెక్స్ నిల్వలు 353.40 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఎఫ్‌సీఏలు 2.5 బిలియన్ డాలర్ల వృద్ధితో 332.50 బిలియన్ డాలర్లకు పెరిగాయి. గోల్డ్ నిల్వలు స్వల్పంగా పెరిగి (0.6 మిలియన్ డాలర్లు) 19.32 బిలియన్ డాలర్లకు చేరాయి.

మరిన్ని వార్తలు