Sakshi News home page

వోల్టాస్‌ లాభం రూ.36 కోట్లు

Published Fri, Oct 20 2023 6:19 AM

Voltas swings to profit Q2 Results - Sakshi

న్యూఢిల్లీ: టాటా గ్రూప్‌ కంపెనీ వోల్టాస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికానికి రూ.36 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.6 కోట్ల నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం. దీంతో పోలిస్తే పనితీరు మెరుగుపడినట్టు తెలుస్తోంది.

మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.1,833 కోట్ల నుంచి రూ.2,364 కోట్లకు వృద్ధి చెందింది. రెడీమబుల్‌ నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ (ఎన్‌సీడీలు) జారీ చేయడం ద్వారా రూ.500 కోట్లు సమీకరించాలని వోల్టాస్‌ బోర్డు నిర్ణయించింది. చైన్నై, గుజరాత్‌లోని వాఘోడియాలో నూతన ప్లాంట్లపై ఈ నిధులను వ్యయం చేయనున్నట్టు తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో వోల్టాస్‌ షేరు ఒక శాతం లోపు పెరిగి రూ.839 వద్ద ముగిసింది.   
 

Advertisement

What’s your opinion

Advertisement