-

భారత్‌లో కొత్త కొలువుల సందడి..

7 Sep, 2018 10:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వేగంగా మారుతున్న ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమలు, మార్కెట్లు సరికొత్త రూపును సంతరించుకుంటున్నాయి. భారత్‌లో ప్రముఖంగా ముందుకొచ్చిన టాప్‌ 10 ఉద్యోగాల జాబితాను లింకెడ్‌ఇన్‌ విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం మెషీన్‌ లెర్నింగ్‌ ఇంజనీర్‌ అగ్రస్ధానంలో నిలిచింది. అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ అనలిస్ట్‌, బ్యాకెండ్‌ డెవలపర్‌ తర్వాతి స్ధానాల్లో ఉండగా, ఫుల్‌స్టాక్‌ ఇంజనీర్‌, డేటా సైంటిస్ట్‌, కస్టమర్‌ సక్సెస్‌ మేనేజర్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ స్పెషలిస్ట్‌, బిగ్‌ డేటా డెవలపర్‌, సేల్స్‌ రిక్రూటర్‌, పైథాన్‌ డెవలపర్‌లు తదుపరి హాట్‌ జాబ్స్‌గా టాప్‌ 10 జాబితాలో చోటుదక్కించుకున్నాయి.

టెక్నాలజీ కొలువులకు భారీ డిమాండ్‌ నెలకొన్నా ఇవి కేవలం టెక్నాలజీ కంపెనీలకే పరిమితం కాలేదని నివేదిక పేర్కొంది. ఫార్మా, బ్యాంకింగ్‌, రిటైల్‌ సహా పలు రంగాలకు చెందిన కంపెనీల్లో టెక్నికల్‌ జాబ్స్‌కు భారీ డిమాండ్‌ ఉందని, ఏటా ఈ కొలువుల్లో 50 లక్షల మంది చేరుతున్నాయని అంచనా వేసింది. భారత్‌లో 5 కోట్ల మంది తమ సభ్యుల ప్రొఫైల్‌ అనుభవాలను విశ్లేషించిన లింకెడ్‌ఇన్‌ ఈ నివేదికను వెల్లడించింది. సాంకేతిక రంగంలో దూసుకెళ్లేందుకు సాఫ్ట్‌స్కిల్స్‌ కీలకంగా మారాయని లింకెడ్‌ఇన్‌ టాలెంట్‌, లెర్నింగ్‌ సొల్యూషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఫియోన్‌ యాంగ్‌ వెల్లడించారు.

మరిన్ని వార్తలు