టోకు ధరలు మైనస్‌లోకి....

15 Jun, 2020 14:27 IST|Sakshi

హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణ(డబ్ల్యూపీఐ)గణాంకాలు మేలో మైనస్‌లో నమోదయ్యాయి. అందుబాటులో ఉన్న గణాంకాలు సమీక్షించిన తర్వాత మేలో డబ్ల్యూపీఐ గణాంకాలు -3.21శాతం నమోదైనట్లు డీపీఐఐటీ తెలిపింది. ఏప్రిల్‌లో అందుబాటులో ఉన్న పరిమితి సమాచారం కారణంగా, మే గణాంకాలను మార్చి గణాంకాలతో పోల్చినట్లు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా ప్రేరేపిత్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో కిందటి నెలలో ఏప్రిల్‌కు సంబంధించిన డబ్ల్యూపీఐ గణాంకాలను ప్రకటించలేదు.

లాక్డౌన్ సమయంలో కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా ధరల డేటాను సేకరించాలని కేంద్ర గణాంకాల శాఖ క్షేత్ర కార్యాలయాలకు సూచించింది. ఎన్నుకున్న పద్ధతుల నుండి స్వీకరించిన సమాచారం ఆధారంగా 2020 ఏప్రిల్ నెల తుది సూచిక వచ్చే నెలలో విడుదల అవుతుంది.’’ అని డీపీఐఐటీ తెలిపింది. 

ఆహార ద్రవ్యోల్బణ 2.55శాతం నుంచి 1.13శాతానికి దిగివచ్చింది. ఇంధన, తయారీ ధరల ద్రవ్యోల్బణం రెండు మైనస్‌ల్లోకి వెళ్లిపోయాయి. సమాచారం లేకపోవడంతో శుక్రవారం విడుదల కావాల్సిన మే నెల రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం శుక్రవారం విడుదల చేయలేకపోయింది.

మరిన్ని వార్తలు